క్రైమ్/లీగల్

మంత్రి పువ్వాడ కాన్వాయ్‌కి ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఫిబ్రవరి 17: రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాన్వయ్ ప్రమాదానికి గురైంది. సోమవారం బంజారాహిల్స్ నుంచి ప్రగతి భవన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 మీదుగా మంత్రి కాన్వాయ్ ప్రయాణిస్తుండగా జలగం వెంగళరావు పార్క్ వద్దకు ద్విచక్రవాహనదారుడు ఆకస్మాత్తుగా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చాడు. దీనిని తప్పించేందుకు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. దీంతో మంత్రి మరో వాహనంలో ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా మంత్రి వాహనానికి అడ్డుగా వెళ్లినది ఎవరన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.