క్రైమ్/లీగల్

పోలవరం కుడికాలువలో పడి ఇద్దరు యువకుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, ఫిబ్రవరి 17:పోలవరం కుడికాలువలో ప్రమాదవశాత్తు జారిపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. గొర్రెలకు కాలువలో నీరు త్రాగించే సమయంలో ఒకరు కాలుజారి కాలువలో పడిపోయాడు. పడిన యువకున్ని మరో యువకుడు రక్షించేందుకు ప్రయాత్నించడంతో ఇద్దరు క్షణాల వ్యవధిలో మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బాపులపాడు మండలం బండారుగుడెం గ్రామంవద్ద పోలవరం కుడికాలువలో సోమవారం జరిగిన ఈసంఘటనకు సంబంధించి వీరవల్లి ఎస్‌ఐ చంటిబాబు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. గ్రామానికి చెందిన దిమ్మిటి నాగరాజు(21), గోళ్ళ విజయ భాస్కరరావు (21) ఇరువురు గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి రోజులానే సోమవారం ఉదయం గొర్రెలను మేపేందుకు బయటకు తీసుకు వెళ్ళారు.మధ్యాహ్నా సమయంలో గొర్రెలకు నీళ్ళు పెట్టేందుకు గ్రామ సమీపంలోని పోలవరం కుడికాలువ వద్దకు వెళ్ళారు. తొలుత నాగరాజు గొర్రెలకు నీళ్ళు పెడుతున్న సమయంలో కాలుజారి ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. నాగరాజును రక్షించే క్రమంలో భాస్కరరావు కూడా కాలువలోకి దుకాడు. నీటి ప్రవాహం, లోతు అధికంగా ఉండడంతో ఇద్దరు కాలువలో మునిగిపోయారు. నాగరాజు, భాస్కరరావులు కాలువలో పడడం గమనించిన మరో గొర్రెల కాపరి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించాడు. వీరవల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కాలువలో మునిగిన వారి కోసం గత ఈతగాళ్ళతో గాలింపు చేపట్టారు. కొద్దిసేపటికి ఇద్దరు యువకుల మృతదేహలను బయటకు తీశారు. లోతు అధికంగా వుండడంతో శ్వాస ఆడకపోవడంతో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని హనుమాన్‌జంక్షన్ సీఐ డీవీ రమణ పరిశీలించారు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.