క్రైమ్/లీగల్

దోపిడీ దొంగల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఫిబ్రవరి 18: అమీర్‌పేటలోని అపరిచితకాలనీలో దొంగలు భీభత్సం సృష్టించారు. మంగళవారం తెల్లవారు ఝామున ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు దోపిడిని అడ్డుకునేందుకు యత్నించిన మహిళపై దాడి చేసి పరారు అయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అపరిచతకాలనీలో పద్మరాఘురాజ్ (86), ఆమె కుమార్తె నందిత కపూర్ (56) మనవరాలు కీర్తి (24)లతో నివాసం ఉంటుంది. మంగళవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో ముసుగులు ధరించి ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో అలజడి జరుగుతుండటంతో నందిత మేల్కొంది. ఆమెను భయపెట్టి నగదు, బంగారు ఆభరణాలు ఎక్కడదాచారని భయబ్రాంతులకు గురిచేశారు. ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు ఏవీలేవని దోపిడిని అడ్డుకునేందుకు యత్నించింది. దీంతో కోపోద్రేకులైన దుండగులు తమ వెంట తెచ్చుకున్న సుత్తితో నందితపై దాడి చేశారు. అనంతరం మిగిలిన ఇద్దరు మేల్కొని బిగ్గర అరవడంతో భయపడిన వారు రూ.1500 తీసుకొని పరారు అయ్యారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి వివరాలను సేకరించారు. దోపిడికి యత్నించిన వీరు సుమారు సమయం 2:20 ప్రాంతంలో ఇంటి వద్దకు చేరుకొని 3 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాల్లోని పుటేజీల ఆధారంగా గుర్తించారు. సంఘటన స్థలాన్ని పశ్చిమ మండలం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఏఆర్ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ మహ్మద్ సిద్ధిఖీ, పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్నతో పాటు సీసీఎస్, టాస్క్ఫోర్సు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు డీసీపీ తెలిపారు.

*