క్రైమ్/లీగల్

నకిలీ సర్ట్ఫికెట్ల రాకెట్‌లో ప్రముఖులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 18: నకిలీ సర్ట్ఫికెట్ల తయారీలో సిద్ధహస్తుడైన గ్లెయిన్ బ్రిగ్స్‌తో దశాబ్దాలుగా కొందరు పోలీసు అధికారులకు సంబంధాలు ఉండటంపై లోతుగా దర్యాప్తు సాగుతోంది. వీరితో పాటు నకిలీ సర్ట్ఫికెట్లతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్న వారి వివరాలు సేకరించే పనిలో అనంతపురం జిల్లా పోలీసులు పడ్డారు. గతంలో నకిలీ సర్ట్ఫికెట్ల కేసులో అరెస్టయి జైలుకెళ్లిన బ్రిగ్స్ బయటకు వచ్చిన తరువాత తన వ్యాపారం కొనసాగించాడు. అతని కదలికలపై జిల్లా పోలీసుల నిఘా పెరగడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తిరుపతికి మకాం మార్చి సునీల్ పేరుతో చెలామణి అవుతూనే నకిలీ సర్ట్ఫికెట్ల తయారీ కొనసాగించాడు. గుంతకల్లు కేంద్రంగా దాదాపు మూడు దశాబ్దాలుగా ఆంగ్లో ఇండియన్ బ్రిగ్స్ నకిలీ సర్ట్ఫికెట్లు విక్రయిస్తూ కోట్లు గడించాడు. అప్పట్లో ఇతనితో పోలీసులు శాఖలోని కానిస్టేబుల్ మొదలు సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు సత్సంబంధాలు నెరిపినట్లు ఆరోపణలున్నాయి. గుత్తి సబ్ జైలులో శిక్ష అనుభవించిన సమయంలో తన అనుచరుడి ద్వారా నకిలీ సర్ట్ఫికెట్లు తయారు చేయించి ఇచ్చేవాడని సమాచారం. అప్పడు కూడా కొందరు పోలీసు అధికారులు ఇతనికి సహకరించి, వారు కూడా నకిలీ సర్ట్ఫికెట్లు తమవారికి ఇప్పించినట్లు ఆరోపణలున్నాయి. గ్లెయిన్ బ్రిగ్స్‌తో ఎస్పీ స్థాయి అధికారి ఒకరికి సంబంధాలున్నట్లు అనంతపురం జిల్లా పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో సత్సంబంధాలు నెరిపిన పోలీసు అధికారులు ఇప్పుడు డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఐజీ స్థాయికి చేరుకుని ఉంటారని అంచనా వేశారు. పైస్థాయి పోలీసు అధికారులు అండగా ఉండటంతోనే గతంలో గ్లెయిన్ బ్రిగ్స్ చాలా కాలం పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా తన నకిలీ సర్ట్ఫికెట్ల దందా కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇటీవల పోలీసులు గుంతకల్లులోని బ్రిగ్స్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లలో లభించిన కీలక సమాచారం ఆధారంగా డొంక కదిలిస్తున్నట్లు సమాచారం. గతంలో పోలీసుశాఖపై పడ్డ మచ్చ తొలగించడం కోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ క్రమంలో నకిలీ సర్ట్ఫికెట్లతో ఉద్యోగాలు, పదోన్నతులు పొందిన పోలీసుల జాబితా తయారు చేస్తున్నట్లు సమాచారం. పోలీసుల చర్యలతో నకిలీ సర్ట్ఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.