క్రైమ్/లీగల్

నాకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదనే చంపేశా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 20: ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ దివ్యను తానే హత్య చేసినట్టు వేములవాడకు చెందిన వెంకటేశ్ ఒప్పుకున్నాడు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ శే్వత కేసు పూర్వాపరాలు వెల్లడించారు. ఈనెల 18న మృతురాలు దివ్య తండ్రి లక్ష్మిరాజ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ పట్టణానికి చెందిన వెంకటేశ్‌పై అనుమానంతో బుధవారం రాత్రి అక్కడే అదుపులోకి తీసుకొని విచారించగా, దివ్యను తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని ఆమె తెలిపారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన దివ్య, వేములవాడకు చెందిన వెంకటేశ్ ఒకే పాఠశాలలో విద్య నభ్యసించగా, వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని తెలిపారు. దివ్య బ్యాంకు, ఇతర కాంపిటీటివ్ పరీక్షలు ప్రిపరేషన్ సమయంలో వెంకటేశ్ ఆమెను ప్రేమిస్తున్నానని వెంట పడేవాడు. ఇంతలో దివ్యకు బ్యాంకు ఉద్యోగం రావడంతో ఐదు నెలల క్రితం గజ్వేల్‌కు తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఉంటోంది. ఉద్యోగం వచ్చిన తర్వాత వెంకటేశ్‌ను ఆమె దూరం పెడుతోందని భావించాడు. దానికి తోడు ఆమె వివాహం వరంగల్‌కు చెందిన మరో బ్యాంకు ఉద్యోగితో నిశ్చయమై ఈ నెల 26న జరగనుండటంతో కక్ష పెంచుకున్న నిందితుడు తనకు దక్కనిది మరెవరికీ దక్కొద్దనే కక్షతో ఈనెల 18న గజ్వేల్ వచ్చాడు. రాత్రి 7.45 గంటల సమయంలో దివ్య బ్యాంకు నుంచి ఒంటరిగా వెళ్లడాన్ని గమనించాడు. అనంతరం దివ్య ఇంటి డాబాపై ఆరవేసిన బట్టలను తీసుకొస్తుండగా, తన బ్యాగులో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతును కోసి, ఇతర భాగాలపై పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు వెంకటేశ్ గజ్వేల్ నుండి సికింద్రాబాద్‌కు చేరుకొని అక్కడి నుండి విజయవాడ, వరంగల్ మీదుగా వేములవాడకు వచ్చాడు. అప్పటికే 5 టీంలుగా విడిపోయి గాలిస్తున్న పోలీసుల కంటబడగా, అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో దివ్యను తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపించినట్టు పోలీసు కమిషనర్ శే్వత తెలిపారు. కాగా 24 గంటల్లో కేసు ఛేదించిన ఏసీపీ నారాయణ, సీఐలు అంజనేయులు, మధుసూదన్‌రెడ్డిలను ఆమె అభినందించారు.
*చిత్రం... కేసు వివరాలు వెల్లడిస్తున్న పోలీస్ కమిషనర్ శే్వత