క్రైమ్/లీగల్

ముగ్గురు జ్యుడీషియల్ అధికారులకు కాశ్మీర్ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ముగ్గురు జ్యుడీషియల్ అధికారులకు జమ్మూ-కాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీం కోర్టు కొలిజీయం సిఫార్సు చేసింది. జ్యుడీషియల్ అధికారులైన వినోద్ ఛటర్జీ కౌల్, సంజయ్ ధార్, పునీత్ గుప్తాలను న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫార్సు చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డె నేతృత్వంలోని కొలిజీయం ఈ నెల 19న సమావేశమై ప్రతిపాదనలపై కసరత్తు చేసి, చివరగా ముగ్గురి పేర్లను సిఫార్సు చేసింది. ఇదిలాఉండగా జ్యుడిషీయల్ అధికారి సత్య గోపాల్ ఛటోపాధ్యాయను త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సూచించింది. ఇంకా న్యాయవాది అనంతం బీమాల్ సింగ్‌ను మణిపూర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డె నేతృత్వంలోని కొలీజియంలో న్యాయమూర్తులు ఎన్వీ రమణ, అరుణ్ మిశ్రా, ఆర్‌ఎఫ్ నారిమణ్, ఆర్.్భనుమతి ఉన్నారు.