క్రైమ్/లీగల్

జంట హత్యల కేసులో ఏడుగురికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, ఫిబ్రవరి 25: కనగల్ మండలంలో 2017 ఆగస్టు 21న చోటుచేసుకున్న జంట హత్యల కేసులో నిందితులు ఏడుగురికి జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.వి.రమేష్ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. కురంపల్లి గ్రామం శివరులోని 937, 938 సర్వేనెంబర్‌లలోని 11 ఎకరాల్లో దాసరి యాదయ్య సాగు చేసుకుంటు, పక్కనే ఉన్న దోటి మణెమ్మకు చెందిన 2.25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. మణెమ్మకు దూరంగా ఉంటున్న భర్త అక్కలయ్య ఆ భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న పథకంతో దోటి పాండరయ్య, మల్లేశ్, దోటి వెంకటేశం, సైదలు, కిరణ్, భరత్‌లతో కలిసి దాసరి యాదయ్య కుమారులైన ఆంజనేయులు, అన్నమయ్యలను కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో మృతుల తండ్రి దాసరి యాదయ్య ఫిర్యాదు మేరకు కనగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించి నిందితులను అరెస్టు చేసి చార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ ముగించిన జడ్జి నిందితులు ఏడుగురికి జీవిత ఖైదుతో పాటు లక్ష 80 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో పీపీగా జవహర్‌లాల్ వ్యవహరించారు.