క్రైమ్/లీగల్

ఢిల్లీ ఘటనలు విచారకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లపై విచారం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే అల్లర్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లను విచారణను నిరాకరించింది. ఈశాన్య ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఘర్షణల్లో 20 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. పోలీసులు మరింత సమర్ధవంతంగా వ్యవహరించి ఉండాల్సిందని ఎస్‌కే కౌల్, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తాము పోలీసుల పనితీరును శంకించడం లేదన్న న్యాయమూర్తులు చట్ట ప్రకారమే పనిచేసుకుపోవాలని ఆదేశించింది. ‘పైనుంచి ఎవరో ఆదేశాలు ఇస్తారని వేచి చూడకుండా చట్ట ప్రకారం మీ పని మీరు చేసుకుపోండి. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దు’అని కోర్టు పేర్కొంది. ఘర్షణలకు ప్రేరేపించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని న్యాయమూర్తులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఢిల్లీ హింసకు సంబంధించి దాఖలైన పిటిషన్లు విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సీఏఏ వ్యతిరేక ఉద్యమాలు, గొడవలకు సంబంధించి కేసులు హైకోర్టు విచారణలో ఉన్నాయని, కాబట్టి అలాంటి పిటిషన్లను విచారించబోమని ధర్మాసనం తెలిపింది. ‘హింసకు సంబంధించి పిటిషన్లను హైకోర్టు విచారిస్తోంది. మేం వాటి జోలికి వెళ్లదలచుకోలేదు. పిటిషన్లను తిరస్కరిస్తున్నాం’అని బెంచ్ స్పష్టం చేసింది. కోర్టు నియమించిన మధ్యవర్తులు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే, న్యాయవాది సాధనా రామచంద్రన్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఢిల్లీ హింసకు సంబంధించిన పిటిషన్లు ఢిల్లీ హైకోర్టు విచారిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలిపారు. ఇలా ఉండగా ఢిల్లీ హింసలో 20 మంది చనిపోయారు. ఆదివారం రాత్రి మొదలైన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చి బుధవారం మరింత విషమించాయి. పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనానికి, సొలిసిటర్ జనరల్‌కు మధ్య వాడీవేడీ మాటలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ హింసకు సంబంధించి ప్రతికూల వ్యాఖలు చేయవద్దని, అలా చేస్తే పోలీసుల ఆత్మస్థయిర్యం దెబ్బతింటుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు.
వెంటనే న్యాయమూర్తి జోసెఫ్ జోక్యం చేసుకుని ‘ పోలీసులు విధి నిర్వహణలో వైఫల్యం చెందారనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. అంతే తప్ప వారిని శంకించాలన్న ఉద్దేశం కాదు. న్యాయమూర్తిగా దానిపై నా అభిప్రాయం వ్యక్తం చేసే అధికారం నాకుంది’అని ఆయన ఘాటుగానే స్పందించారు. ‘పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. యూకే, యూస్‌ఏలో పోలీసుల విధులను ఓ సారి పరిశీలించాలి. గొడవలకు ప్రేరేపించే వారినికి ఉపేక్షించకూడదు. చట్ట ప్రకారం నడుచుకోవాలి. అంతే తప్ప ఎవవో చెబుతారని వేచి చూడకూడదు’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పోలీసులు చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించి ఉంటే హింసకు ఆస్కారం ఉండేది కాదని కోర్టు స్పష్టం చేసింది. ‘మమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకోకండి. విస్తృత ప్రయోజనాల రీత్యా మేం ఆ వ్యాఖ్యలు చేశాం. మేం ఢిల్లీ పోలీసులను అవమానించడం లేదు. తప్పుపట్టడం లేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల బట్టి పోలీసుల కఠినంగా వ్యవహరించాలి’అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. అలాగే షహీన్ బాగ్ కేసు తదుపరి విచారణను మార్చి 23కు వాయిదా వేశారు.