క్రైమ్/లీగల్

చాంద్ బాగ్ ప్రాంతంలో ఐబీ ఉద్యోగి మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఇటీవల అల్లర్లు చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీలోని చాంద్ బాగ్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉద్యోగి మృతదేహాన్ని పోలీసులు బుధవారం కనుగొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి 26 ఏళ్ల అంకిత్ శర్మ కనిపించకుండా పోయారు. అతని ఆచూకీ గురించి గాలిస్తున్న పోలీసులకు బుధవారం ఉదయం మృతదేహం లభించింది. రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కారణంగానే అంకిత్ మృతి చెంది ఉంటారని పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్థారణకు వచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. అంకిత్ శర్మ తండ్రి దేవేంద్ర శర్మ కూడా ఐబీలోనే పనిచేస్తున్నారు. ఆయన పీటీఐతో మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో తమ కుమారుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడని తెలిపారు. అర్ధరాత్రి దాకా రాకపోవడంతో తాము ఆందోళన చెందామని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని దేవేందర్ అన్నారు. పలు ఆసుపత్రులకు వెళ్లి వాకబు చేశామని అన్నారు. బుధవారం ఉదయం చాంద్ బాగ్ ప్రాంతంలో దొరికిన మృతదేహం తన కుమారుడిదేనని ఆయన అన్నారు. మృతుడి తల్లి సుధ బాధ వర్ణనాతీతం. ఎదిగివచ్చిన కుమారుడిని కోల్పోయానంటూ ఆమె కన్నీరుమున్నీరు అవుతోంది. నిరసనల పేరుతో సంఘ విద్రోహ శక్తులు అకృత్యాలకు పాల్పడుతున్నారనడానికి ఇదో ఉదాహరణ అని ఆమె వ్యాఖ్యానించారు.
*అంకిత్ శర్మ (ఫైల్‌ఫొటో )