క్రైమ్/లీగల్

మీ అభిప్రాయం చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గృహ నిర్బింధం కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మెహబూబాను ప్రజా భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. పీడీపీ అధినేతను అక్రంగా నిర్బంధించి నెలల తరబడి విడుదల చేయకుండా ఉంచారంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మెహబూబా ముఫ్తీ కుమార్తె లితిజా ముఫ్తీ వివరణ కోరింది. తల్లి నిర్బంధంపై జుడీషియల్ ఫోరంను గాని, హైకోర్టును గాని ఆశ్రయించారా?అని కోర్టు అడిగింది. కాగా ప్రజా భద్రతా చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ లితిజా ముఫ్తీ హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మెహబూబాను గృహ నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు ఫిబ్రవరి 5న ప్రజా భద్రతా చట్టం(పీఎస్‌ఏ) ప్రయోగించారు. కాగా మెహబూబా ముఫ్తీ నిర్బంధంపై దాఖలపై పిటిషన్ తదుపరి విచారణను మార్చి 18కు వాయిదా వేశారు. పిటిషన్ లఘు విచారణకు లితిజా ముఫ్తీ తరఫున న్యాయవాది రామకృష్ణన్ హాజరయ్యారు. ‘మెహబూబాను ఉద్దేశపూర్వకంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె పట్ల అవమానకరంగా వ్యవహరించడమే కాదు, ఏకపక్షంగా వ్యవహరించారు’అని న్యాయవాది ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రిగానే కాదు, కనీసం ఒక వ్యక్తిగా ఆమెకున్న ప్రాథమిక స్వేచ్ఛను హరించారని ఆమె కోర్టుకు తెలిపారు. మెహబూబా నిర్బంధంపై ఆమె కుమార్తె హైకోర్టు లేదా జుడీషియల్ ఫోరంలో సవాల్ చేసి ఉంటే సంబంధిత వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయవాదిని బెంచ్ ఆదేశించింది. ఒకటి రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేస్తామని నిత్య వెల్లడించారు. చౌకబారు రాజకీయాలు చేస్తూ ప్రజాదరణ ఉన్న నాయకురాలిపై అబాండాలు మోపారని న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. మెహబూబా ముఫ్తీని అక్రమంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఇలా ఉండగా జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లానూ పీఎస్‌ఏ కింద గృహ నిర్బంధంలో ఉంచారు. ఒమర్ నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఆయన సోదరి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు జమ్మూకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.