క్రైమ్/లీగల్

చెన్నమనేని పౌరసత్వం రద్దుపై స్టే కొనసాగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సిరిసిల్ల రాజన్న జిల్లా, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై స్టేను మరోమారు హైకోర్టు పొడిగించింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గత నవంబర్‌లో స్టే ఇచ్చింది. తాజాగా ఆ ఉత్తర్వులను మార్చి 10వ తేదీ వరకూ పొడిగించింది. బుధవారం నాడు హైకోర్టులో ఈ అంశంపై విచారణ కొనసాగింది. తదుపరి
విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. చెన్నమనేని రమేష్ ఇప్పటికీ జర్మనీ పాస్‌పోర్టుతోనే విదేశాలకు వెళ్తున్నారని కేంద్ర హోం శాఖ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. తద్వారా రమేష్ జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని పేర్కొంది. దీంతో భారత పౌరసత్వం ఉందని చెబుతూనే జర్మనీ పాస్‌పోర్టుతో ఎందుకు విదేశాలకు వెళ్లారని న్యాయస్థానం చెన్నమనేనని ప్రశ్నిచింది. దానికి చెన్నమనేని బదులిస్తూ జర్మనీ పౌరసత్వాన్ని ఎన్నడో రద్దు చేసుకున్నట్టు తెలిపారు. జర్మనీ పౌరసత్వాన్ని రద్దు చేసుకుంటే అందుకు సంబంధించి జర్మనీ ఆమోదం తెలిపిందా? ఉత్తర్వులున్నాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. వాస్తవాలను దాచి, మోసపూరిత విధానాల ద్వారా చెన్నమనేని రమేశ్ భారతీయ పౌరసత్వం పొందినట్టు నిర్థారించి కేంద్ర హోం శాఖ గత ఏడాది నవంబర్ 20న ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది.