క్రైమ్/లీగల్

ఇక ఉరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరి శిక్షను అమలు చేసేందుకు ఉన్న అడ్డంకులన్నీ దాదాపుగా తొలగిపోయాయి. దీనితో వారి ఉరి అమలు కావడమే మిగిలింది. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ నిర్భయ నాలుగో నింధితుడు పవన్‌గుప్త పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించటంతో నలుగురు ఏరరూప రాక్షసులకు ఉరి శిక్ష విధించేందుకు అన్ని అడ్డంకులు సంపూర్ణంగా తొలగిపోయాయి. దీనితో వీరిని ఉరి తీసేందుకు రంగం సిద్ధమవుతోంది. నిర్భయ నింధితులను ఉరి తీసేందుకు తాజా తేదీలు నిర్ణయించి డెత్ వారంట్లు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం పటియాలా సెషన్ కోర్టులో బుధవారం తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. ఆ వెంటనే, నలుగురు దోషులకు పటియాలా సెషన్ కోర్టు అదనపు న్యాయమూర్తి ధర్మేందర్ రాణా నోటీసులు జారీ చేశారు. ఉరి శిక్షను అమలు చేసేందుకు తాజా తేదీలను ఖరారుకు సంబంధించిన విచారణను గురువారం చేపడతారు. పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్టప్రతి తిరస్కరించటంతో నలుగురు నిర్భయ నిందితులకు సంబంధించిన ఎలాంటి పిటిషన్లు కూడా ఏ కోర్టుల్లో పెండింగ్‌లో లేవు. దీనితో వారిని ఉరి తీసేందుకు తాజా తేదీలు ఖరారు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం పటియాలా సెషన్ అదనపు న్యాయమూర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు
చేపట్టేందుకు న్యాయమూర్తి ధర్మేందర్ రాణా నిందితులకు తాజా నోటీసులు జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన విచారణ చేపడతారు. ఇదిలావుంటే, పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్టప్రతి తిరస్కరించినట్లు తమకు సమాచారం అందినట్టు తిహార్ జైలు అధికారులు పటియాలా కోర్టుకు తెలియజేశారు. ఢిల్లీ ప్రభుత్వం సీఆర్‌పీసీ 413 సెక్షన్ ప్రకారం పటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, నిర్భయ నింధితులను ఉరి తీసేందుకు తాజా తేదీలు ఖరారు చేయాలని కోరారు. న్యాయపరమైన అవకాశాలను ఏడు రోజుల్లోగా ఉపయోగించుకోవాలంటూ హైకోర్టు విధించిన గడువు కూడా పూర్తి అయినందున నలుగురు నిందితులను ఉరి తీసేందుకు డెత్ వారంట్లు జారీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం తమ తాజా పిటిషన్‌లో కోర్టును కోరింది. ఇంత వరకూ మూడు డెత్ వారంట్లు జారీ కావటం, నింధితుల న్యాయవాది చట్టాలలోని లొసుగులను ఉపయోగించటం ద్వారా ఉరి శిక్ష అమలు కాకుండా వాయిదా వేయించటం తెలిసిందే. ఇప్పుడు ఉరి అమలు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ, మళ్లీ ఏవైనా కొత్త అవాంతరాలు పుట్టుకొస్తాయేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.