క్రైమ్/లీగల్

రూ.12లక్షల విలువైన గంజాయి స్వాధీనం, కారు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 7: విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి బతుకులను ఛిద్రం చేస్తున్న నిషేధ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మత్తునిస్తూ ప్రాణాలను హరించే గంజాయి రవాణాపై ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టి కొరడా ధుళిపిస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహించి విక్రేతల కదలికలను పసిగడుతూ వారిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపిస్తున్నా..గంజాయి విక్రయాలు ఆగడంలేదు. శనివారం తెల్లవారుజామున ఉప్పల్ పట్టణంలోని కేటీఎం షోరూం వద్ద సమాచారం అందుకున్న అధికారులు నగరానికి కారులో రవాణా చేస్తున్న నల్గురిలో ఇద్దరు యాదాద్రి జిల్లా మూటకొండూరు గ్రామానికి చెందిన దామెర నరేష్ (36), మల్లాపూర్ శక్తిసాయినగర్‌కు చెందిన బొద్దుల గణేష్ (34)ను అరెస్తు చేసి వారి నుంచి రూ.12లక్షల విలువైన 120 కిలోల గంజాయి బ్యాగులను స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. మరో ఇద్దరు లోహ రాజు, దాసరి మణికంఠ రాజులు పరారీలో ఉన్నారు. దాడుల్లో ఈఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.