క్రైమ్/లీగల్

గుడిపాడులో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసునూరు, మార్చి 5: ప్రేమించిన వాడినే నమ్మింది... తల్లిదండ్రులను వదులుకుని పెద్దల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుని ప్రియుడి ఇంటి వద్దే ఉంటున్న మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కలుపుమందుతాగడంతో ఆసుపత్రికి తరలించామని చికిత్స పొందుతూ మృతి చెందిందని ప్రియుడి తల్లిదండ్రులు, బంధువులు చెబుతుండగా మైనర్ బాలిక తల్లిదండ్రులు మాత్రం ఇది ముమ్మాటికే హత్యేనని, ప్రియుడు, అతని తల్లిదండ్రులు కలిసి తన కుమార్తె చేత కలుపుమందు బలవంతంగా తాగించి హత్య చేశారని మైనర్ బాలిక తండ్రి, అన్న, మైనర్ బాలిక మేనమామలు చెబుతున్నారు. దీనికి సంబంధించి సేకరించిన, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుడిపాడు గ్రామానికి చెందిన పల్లి కుటుంబరావు కుమారుడు శివాజి అదే గ్రామానికి చెందిన మారుమూడి రత్నకిషోర్ కుమార్తె మైనర్ బాలిక శ్రావణి గత సంవత్సరకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈవిషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలిసి పెళ్ళి చేసేందుకు నిర్ణయించుకున్నారు. కాగా శ్రావణి మైనర్ కావడంతో మేజర్ అయిన తరువాత పెళ్ళి చేయాలని గ్రామపెద్దల సమక్షంలో నిర్ణయించుకుని ఒప్పందం చేసుకున్నారు. ఈక్రమంలో శ్రావణి ప్రియుడి ఇంటి వద్దే ఉంటానని చెప్పడంతో పెద్దలు ప్రియుడి తండ్రి కుటుంబరావుసమక్షంలో శ్రావణిని ప్రియుడి ఇంటికి పంపారు. ఈ క్రమంలో 3 నెలల నుండి శ్రావణిపై ప్రియుడు శివాజి, అత్త ధనలక్ష్మి, మామ కుటుంబరావులు 5లక్షల కట్నం తీసుకురావాలని, లేకుంటే మాకుమారునికి వేరే పెళ్ళి చేస్తామని చెప్పడంతో శ్రావణి ఈవిషయాన్ని తండ్రితో వివరించింది. ప్రస్తుతం తమ వద్ద అంత సొమ్ము లేదని, ఉన్న పొలం అమ్మి చెల్లిస్తామని చెప్పి పంపారు. అయినా ప్రియుడి తరుపు నుండి వేధింపులు ఎక్కువై ప్రతి రోజు చిత్ర హింసలు పెడుతున్నారని శ్రావణి తమకు తెలిపిందని తండ్రి రత్నకిషోర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపినట్లు ఎస్‌ఐ వివరించారు. ఈనెల 2వ తేదీన శ్రావణి కలుపుమందు తాగిందని శివాజి, అతని కుటుంబ సభ్యులు నూజివీడు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రావణి చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు, ఈవిషయంపై కనీసం తమ కుమార్తె పురుగుల మందు తాగిందని, ఆమెను ఆసుపత్రికి తరలించామని కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని, గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చెబితే తమకు తెలిసిందని శ్రావణి తండ్రి చెప్పి కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కుమార్తెను శివాజి, అతని తండ్రి కుటుంబరావు, తల్లి ధనలక్ష్మిలు కావాలనే తన కుమార్తె నోట్లో కలుపుమందు పోసి తానే తాగిందని చెప్పి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది ముమ్మాటికి హత్యేనని, తన కుమార్తె మృతికి కారకులైన శివాజి, అతని తల్లిదండ్రులు కుటుంబరావు, ధనలక్ష్మిలపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్‌ఐ కె రాజారెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా శివాజికి మరోకరితో వివాహం చేసేందుకు శివాజి తల్లిదండ్రులు ప్రయత్నాలు ప్రారంభించారని, ఈక్రమంలోనే శ్రావణిని ఏలాగైనా వదిలించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే కట్నం తేవాలని వత్తిడి చేస్తు, మానసీకంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసినప్పటికీ తమ కుమార్తె వేధింపులను భరిస్తూ శివాజీ ఇంటి వద్దనే ఉండటంతో పథకం ప్రకారం నోట్లో కలుపుపోసి హత్యచేసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మృతురాలి తండ్రి రత్నకిషోర్ గురువారం విలేఖరులకు వివరించారు. నూజివీడు డీఎస్‌పీ బి శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మృతురాలికి శవపంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నట్లు ఎస్‌ఐ వివరించారు.