క్రైమ్/లీగల్

ఎంపీ రేవంత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ (నార్సింగి), మార్చి 5: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రేవంత్‌రెడ్డిని గురువారం నార్సిం గి పోలీసులు అరెస్టు చేశారు. పార్లమెంట్ స మావేశాలు కొనసాగుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నారని తెలిసిన పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపు అక్కడ పెద్ద సీన్‌ను క్రియేట్ చేసిన పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నించినప్పటికీ స్పందించకుండా నేరుగా నార్సింగ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ నెల 2వ తేదీన కేటీఆర్ ఫామ్‌హౌస్ ముందు ఆందోళన చేసిన రేవంత్‌రెడ్డి అక్కడ డ్రోన్ కెమెరాతో ఫామ్‌హౌస్ లోపల చిత్రీకరణ చేసారన్న ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు ఈ మేర కు అతనిని అదుపులోకి
తీసుకున్నారు. అయితే, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డినే నార్సింగ్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని స్వయంగా లొంగిపోయారని పోలీసులు చెపుతుండగా అందుకు భిన్నంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అరెస్టు చేశారని ఆయన అనుచరులు అంటున్నారు. ఈ నెల 2వ తేదీన జన్వాడ ప్రాంతంలోని మంత్రి కేటిఆర్ ఫామ్‌హౌస్ వద్ద ఆందోళనకు దిగడంతో ఆయనతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేయగా ఇప్పటికే ఈ కేసులో డ్రోన్ వినియోగించినందుకు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. పోలీసులు రేవంత్‌రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం కోర్టు సమయం అయిపోవడంతో ఉప్పర్‌పల్లి నలందానగర్‌లోని న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచారు. న్యాయమూర్తి రేవంత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఎంపీ రేవంత్‌రెడ్డిని భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి జైలుకు తరలించారు. రేవంత్‌రెడ్డి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడంతో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పార్టీ నాయకుడు నందికంటి శ్రీధర్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రేవంత్‌రెడ్డిని తరలించే సమయంలో పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అనంతరం న్యాయమూర్తి నివాసం ముందు కూడా కాంగ్రెస్ నాయకులు సీతక్క తదిరులు రేవంత్‌రెడ్డిని కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

*చిత్రం... కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని జైలుకు తరలిస్తున్న పోలీసులు