క్రైమ్/లీగల్
శిక్ష తప్పదన్న భయంతోనే..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఖైరతాబాద్/సికిందరాబాద్: రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమూల్య తండ్రి మారూతీ రావు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయింది. తన కూతురును కులాంతర వివాహం చేసున్నాడని అల్లుడు ప్రణయ్‌ను కిరాయి ముఠాతో వ్యాపారి మారుతీ రావు పరువు హత్య చేయించిన విషయం తెలిసిందే. జైలుకెళ్లి ఇటీవలనే బెయిల్ పై విడుదలైన మారుతీ రావు రెండు రోజుల క్రితం హైదరాబాద్, ఖైరతాబాద్, చింతల బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌లో రూమ్‌ను అద్దెకు తీసుకున్నాడని, శనివారం రాత్రి తాను ఒక్కడే రూమ్‌లో ఉండి డ్రైవర్ రాజేష్‌ను కారులోనే పడుకోమని చెప్పాడని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం మారుతీ రావు భార్య గిరిజ ఎన్ని సార్లు ఫోన్ చేసినా లేపకపోవడంతో రాజేష్‌కు పోన్ చేసి రూమ్‌కు వెళ్లమని చెప్పింది. డ్రైవర్ రజేష్ ఎన్ని సార్లు బెల్ కొట్టినా తలుపు తీయకపోవడంతో సిబ్బందితో కలసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని తలుపులు పగులగొట్టి చూడగా బెడ్ మీద మారుతీ రావు విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబసభ్యులకు సమాచారమిచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమితం ఉస్మానియా మార్చరీకి తరలించినట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం మిర్యాలగూడలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
*అమూల్య తండ్రి మారూతీ రావు (ఫైల్‌ఫొటో)