క్రైమ్/లీగల్
సీపీఐ మావోయిస్టు దళ సభ్యురాలు అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఏటూరునాగారం, మార్చి 8: నిషిద్ధ పీపుల్స్‌వార్ మావోయిస్టు పార్టీ పామేడు ఏరియా దళ కమాండర్‌గా పనిచేస్తున్న జయమతి అలియాస్ మోతీని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్థానిక సీఐ పాటి నాగబాబు వివరాలు వెల్లడించారు. మార్చి 7న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఎస్సై ననుగంటి శ్రీకాంత్‌రెడ్డి తన సిబ్బందితో ఏటూరునాగారం మండల కేంద్రంలో పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో బస్టాండ్ ప్రాంతంలో ఒక మహిళ అనుమానాస్పదంగా తారసపడటంతో ఆమె వద్దనున్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా డిటొనేటర్, విప్లవ సాహిత్యం, రెండు మీటర్ల కార్డెక్స్ వైర్, స్టీల్ టిఫిన్ బాక్స్ లభ్యమయ్యాయన్నారు. వస్తువులను స్వాధీనం చేసుకుని ఆమెను విచారించగా చత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా బైరామ్గర్ తహశీల్, పుల్లుం గ్రామం, మురియగొండి ప్రాంతానికి చెందిన హేమ్ల జయమతి అలియాస్ మోతీగా తెలిపిందన్నారు. అడవి దగ్గరగానున్న తన నివాస ప్రాంతానికి పార్టీ అనుచరులు తరచూ వస్తుండటం, పార్టీ ఆట, పాటలకు, సిద్ధాంతాలకు ఆకర్షితురాలై, తనవారు పార్టీలో చేరడంతో తాను 14 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తోంది. కాగా 2008 నుండి 2015 వరకు తొమ్మిదో ప్లాటూన్ ‘సి’ కంపెనీలో కమాండర్‌గా పనిచేసి, 2017 నుంచి పామేడు ఏరియా దళ సభ్యురాలిగా పార్టీలో కొనసాగుతోంది. పామేడు ఏరియా కమిటీ మనీలా ఆదేశాల మేరకు చత్తీస్‌గఢ్ నుండి ములుగు జిల్లా ఏటూరునాగారం వచ్చానని, గుర్తు తెలియని వ్యక్తినుండి రెండు మీటర్ల కార్డెక్స్ వైర్, డిటొనేటర్, స్టీల్ టిఫిన్‌బాక్స్, విప్లవ సాహిత్యం తీసుకుని వెళ్ళే క్రమంలో పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. కాగా అనేక పర్యాయాలు ఎన్‌కౌంటర్లలో పాల్గొందని, మే-2013లో చిన్నగల్లెం, బాన్సీగూడ పోలీస్టేషన్ పరిధిలో ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైర్‌లో పాల్గొంది. జయమతి అలియాస్ మోతీపై చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 8 లక్షల నగదు బహుమతి ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎస్సై ననుగంటి శ్రీకాంత్‌రెడ్డి, సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ పాల్గొన్నారు.
*చిత్రం...విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న సీఐ నాగబాబు