క్రైమ్/లీగల్

అదృశ్యమైన చిన్నారి కథ సుఖాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, మార్చి 9: హైదర్షాకోట్ మాధవినగర్ కాలనీలో ఓ మూడు సంవత్సరాల బాలుడు తప్పిపోయి రోడ్డుపై ఏడుస్తూ కనిపించడంతో స్థానికులు చేరదసీ తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిమూసిరిప్ప గ్రామానికి చెందిన సత్తయ్య, అమృత భార్యభర్తలు, బతుకుదెరువు కోసం హైదర్షాకోట్ ప్రాంతానికి వచ్చి మాధవినగర్ కాలనీలో నివసిస్తున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఇంట్లో పని చేసుకుంటున్న అమృత దృష్టిమలచి చిన్నారిని నారి(3) బయటకు వచ్చాడు. ఆడుకుంటూ అలాగే ప్రధాన రహదారి వద్దకు వచ్చాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఏడుస్తూ నిలపడడంతో స్థానికులు చిన్నారిని చేరదీసి వివరాలు అడిగిన మాటలు రాకపోవడంతో ఎలాంటి సమాధానం తెలపలేదు. దీంతో స్థానికులు రెండు గంటల పాటు బాలుడిని చేరదీసి వాట్సప్ గ్రూప్‌లలో సమాచారం ఇచ్చారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో తల్లి కుమారుడు కనిపించడం లేదంటూ బస్తీలో తిరుగుతండడంతో విషయాన్ని తెలిపి నానిని తల్లికి అప్పగించారు.