క్రైమ్/లీగల్

భవనం పైనుంచి పడి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 9: మూడవ అంతస్తు పైనుంచి పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పైపులైన్ రోడ్డు లక్ష్మిగంగా ఎన్‌క్లేవ్‌లో నివాసముండే నితిన్ రెడ్డి కుమారుడు శ్రీహన్ రెడ్డి (6) ప్లే స్కూల్‌కి వెళ్తున్నాడు. జీడిమెట్లలోని తన సోదురుని ఇంటికి వెళ్లిన శ్రీహన్ రెడ్డికి తల్లి మూడో అంతస్థు పై బాల్కనీలో భోజనాన్ని తినిపిస్తుంది. నీటి కోసం తల్లి ఇంట్లోకి వెళ్లగా శ్రీహన్ రెడ్డి కింద పడిపోయాడు. గాయాలకు గురైన శ్రీహన్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.