క్రైమ్/లీగల్

రేవంత్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను మియాపూర్ న్యా యస్థానం తిరస్కరించింది. నార్సిం గి ఠాణా పరిధిలోని మియాపూర్ గడ్డలో అనుమతి లేకుం డా డ్రోన్ కెమెరా ఉపయోగించిన కేసులో రేవంత్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 6వ తేదీ న నార్సింగి పోలీసులు అతనిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు. రేవంత్‌రెడ్డి తరఫున న్యాయవాది పాండురంగారెడ్డి ఈ నెల 7న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యా యస్థానం బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. డ్రోన్ కెమెరా కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని నార్సింగి పోలీసులు ఈ నెల 4వ తేదీన అరెస్టు చేశారు. ఆ ఆరుగురికీ రాజేంద్రనగర్ న్యాయస్థానం ఈనెల 7వ తేదీన బెయిల్ మంజూరు చేయడంతో వారు విడుదలయ్యారు. డ్రోన్ కెమెరాతో చిత్రీకరణ ఆరోపణల కేసుపై రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడి తరఫున న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. రేవంత్‌రెడ్డి, సోదరుడు కృష్ణారెడ్డి నార్సింగి పోలీసు స్టేషన్‌లో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
*చిత్రం...మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్‌రెడ్డి