క్రైమ్/లీగల్

సీబీఐకి వివేకా కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని హైకోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్‌రెడ్డికి చిన్నాన్న. గత ఏడాది మార్చి 15వ తేదీ వైఎస్.వివేకానందరెడ్డి పులివెందులలోని తన స్వగృహంలోనే దారుణ హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుతో మరణించారని ప్రసారమాద్యమాలకు లీక్ చేశారు. ఆ తర్వాత రెండుగంటల్లోనే వివేకానందరెడ్డి దారుణహత్యకు గురైనట్లు ప్రకటించారు. కడప జిల్లాలో అన్ని పార్టీల నాయకులు, ప్రజలతో రాజకీయ వైరుధ్యాలు లేకుండా సన్నిహితంగా మెలిగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య అందరిలో సానుభూతిని నింపింది. శాసనసభ ఎన్నికల ప్రచార సమయం కావడంతో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండూ ఈ హత్యను రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు అస్త్రంగా వాడుకునేందుకు ప్రయత్నించాయి. చంద్రబాబునాయుడు ఈ హత్యపై విచారణకు సిట్ బృందాన్ని ఏర్పాటుచేశారు. వివేకాను వైఎస్ జగన్ కుటుంబసభ్యులే హత్యచేశారని ఎన్నికల ప్రచారంలో బాహాటంగానే విమర్శించారు. వైఎస్ జగన్ ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ చంద్రబాబునాయుడు వేసిన సిట్‌పై తమకు నమ్మకం
లేదని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పట్లో తెలుగుదేశంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బిటెక్ రవి ఈ హత్య చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. వైఎస్ జగన్ వత్తిడితో, అప్పట్లో ఎస్పీగా ఉన్న రాహుల్‌దేవ్ శర్మను ఎన్నికల కోడ్ ఉండగానే ఎన్నికల సంఘం బదిలీ చేసింది. సిట్ బృందం నుండి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో అభిషేక్ మహంతి జిల్లా ఎస్పీగా వచ్చారు. ఈ హత్యకేసుపై విచారణ ఏడాది కావస్తున్నా పూర్తి కాలేదు. అనుమానితులుగా దాదాపు 50 మందిని విచారించారు. ప్రాథమికంగా గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌పై కేసు నమోదుచేసి పలువురిని విచారిస్తూనే ఉన్నారు. వైఎస్ వివేకాకు సన్నిహితునిగా ఉన్న పరమేశ్వరరెడ్డి, ఆయన బావమరిది కె.శ్రీనివాసులురెడ్డిని పలుమార్లు విచారించారు. ఈ విచారణలన్నీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయి. అనుమానితునిగా కె.శ్రీనివాసులురెడ్డిని పలుసార్లు పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఈనేపధ్యంలోనే కె.శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు విమర్శలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంతకుముందు వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పనిచేయకపోవడం విమర్శలకు దారితీసింది. ఇదే సమయంలో కేసును సీబీఐకి అప్పగించాలని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, బిటెక్ రవి హైకోర్టులో పిటీషన్ వేశారు. ఇటీవల వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత కూడా కేసును సీబీఐకీ అప్పగించాలని పిటీషన్ వేశారు. ఈ పిటీషన్లపై విచారించిన హైకోర్టు బుధవారం కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ హత్యలో అంతర్ రాష్ట్ర నేరస్తులు ఉండవచ్చని, అంతర్ రాష్ట్ర నేరస్తులను విచారించే సామర్థ్యం సీబీఐకే ఉందని అభిప్రాయపడింది. ఏడాది కావస్తున్నా విచారణ పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మిస్టరీగా మిగిలిపోయిన వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐకే అప్పగించాలని ఆదేశించడం కీలకమైన మలుపుగానే విశే్లషకులు భావిస్తున్నారు.