క్రైమ్/లీగల్

11మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్: రాజస్థాన్‌లో శనివారం ఉదయం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్తగా పెళ్లయిన దంపతులు సహా 11మంది మృతి చెందారు. జోధ్‌పూర్ జిల్లాలోని షేగఢ్ సబ్ డివిజన్ పరిధిలో గల సోయిన్‌తర గ్రామానికి సమీపంలో ఎదురుగా వస్తున్న ఒక ట్రక్కును ఒక కారు ఢీకొనడంతో ఆ కారులో ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు. కారులో విక్రం, సీత అనే నవ దంపతులతో కలిసి ప్రయాణిస్తూ మృతి చెందిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా బార్మర్ నగరంలోని బాలోత్ర నుంచి ప్రసిద్ధి గాంచిన బాబా రామ్‌దేవ్ ఆలయంలో పూజలు చేసేందుకు రామ్‌దేవరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు చెప్పారు. ‘కారును హైవేపై పక్కకు తిప్పడానికి ప్రయత్నిస్తుండగా అది ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు’ అని జోధ్‌పూర్ (రూరల్) పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) రాహుల్ బర్హాత్ తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకొని పోలీసులు, గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఛిన్నాభిన్నమైన వాహనాలను విడదీయడానికి, మృతదేహాలను కారులోనుంచి బయటకు తీయడానికి ఒక క్రేన్‌ను ఉపయోగించినట్టు పోలీసులు చెప్పారు.
ప్రధాని సంతాపం
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మంది మృతి చెందడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘మృతుల కుటుంబాలకు నేను నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని మోదీ పేర్కొన్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో తెలిపింది.