క్రైమ్/లీగల్

లారీని ఢీకొట్టి బైకిస్టు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, మార్చి 16: గన్నవరం- ఆగిరిపల్లి రహదారిలో గన్నవరం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఆగిఉన్న లారీని ఢీకొట్టి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గన్నవరం నుండి బీబీగూడెం బైక్‌పై వెళుతున్న జార్ఘంట్‌కు చెందిన నోయేల్ రుజ్వర్ (22) ఆగిఉన్న లారీని ఢీకొనడంతో ఈప్రమాదం సంభవించింది. మృతుడు సెంట్రింగ్ పని నిమిత్తం బీబీగూడెం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరిక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.