క్రైమ్/లీగల్

నిర్భయ దోషికి మళ్లీ భంగపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: ఉరిశిక్ష నుంచి ఎలాగోలా తప్పించుకోడానికి నిర్భయ దోషులు చేస్తున్న ప్రయత్నాలు న్యాయస్థానాల్లో బెడిసికొడుతునే ఉన్నాయి. తాజాగా దోషుల్లో ఒకడు ముకేష్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు భంగపాటు ఎదురైంది. తనకు విధించిన ఉరిశిక్షను రద్దుచేయాలంటూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా డిస్మిస్ చేశారు. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలోనే లేనని ముకేష్ సింగ్ బుకాయించాడు. ‘డిసెంబర్ 16న నేను ఢిల్లీలోనే లేను. నన్ను రాజస్థాన్‌లో అరెస్టు చేసిన 17న ఢిల్లీ తీసుకొచ్చారు‘అని పిటిషన్‌లో ఆరోపించాడు. మంగళవారం పిటిషన్ విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ ఉరిశిక్ష అమలును వాయిదా వేయంచుకోడానికే ముద్దాయి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని కోర్టు దృష్టికి తెచ్చారు. తీహర్ జైలులో తనను చిత్రహింసలకు గురిచేశారని ముకేష్ సింగ్ ఆరోపించాడు. పిటిషనర్‌పై న్యాయమూర్తి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘దోషి తరఫున్యాయవాదికి కాస్త పరిస్థితిపై అవగాహన కల్పించండి’అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు జడ్జి సూచించారు. మార్చి 5న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ చేసింది. మార్చి 20న ఉదయం 5.30కు ఉరిశిక్ష అమలు చేయాలని ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది.
ఉరిశిక్ష అమలకు ఏర్పాట్లు: నిర్భయ దోషులను ఉరిశిక్ష అమలుకు తీహార్ జైలులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 20న ఉదయం 5.30కు ఉరిశిక్ష అమలు చేయాలన్న కోర్టు తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు మార్చి 5న ట్రయల్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.