క్రైమ్/లీగల్

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, మార్చి 17: ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. సకాలంలో స్పందించిన చందానగర్ పోలీసులు దొంగను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ముంబయి జాతీయ రహదారిపై చందానగర్ వద్ద ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి 12గంటల సమయంలో ఓ వ్యక్తి చొరబడి మెషిన్‌ను ధ్వంసం చేశాడు. అనుమానం వచ్చిన స్థానికుడు 100 నెంబర్‌కు ఫోన్ చేయడంతో చందానగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఏటీఎం దోపిడీకి యత్నిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్డాటౌన్‌కు చెందిన అనిల్ మండల్ (23)గా గుర్తించి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. చందానగర్ ఇన్‌స్పెక్టర్ బీ.రవీందర్ ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.