క్రైమ్/లీగల్

బాలుడి కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, మార్చి 17: సైబరాబాద్‌లోని న్యూ హఫీజ్‌పేటలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన మియాపూర్ పోలీసులు ఐదు బృందాలుగా రంగంలోకి దిగి నాలుగు గంటల్లోనే కిడ్నాపర్‌ను పట్టుకుని బాలుడిని క్షేమంగా తల్లికి అప్పగించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం వివరాలను ఏసీపీ కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. న్యూ హఫీజ్‌పేటలోని ఆదిత్యనగర్‌లోని వీధి నెంబర్ 7లో నివసిస్తున్న ఫర్హీన్ సుల్తానా ఇంట్లోకి మంగళవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. తన రెండేళ్ల కొడుకు మహ్మద్ అష్కాన్‌ను ఎత్తుకుని పారిపోయాడు. వెంటనే మియాపూర్ పోలీసులను ఆశ్రయించగా ఇన్‌స్పెక్టర్ శామల వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ నుంచి సేకరించిన ఆధారాలతో నిందితుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. మాదాపూర్‌లోని కల్లు దుకాణం సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడనే సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. అపహరణకు గురైన బాలుడిని తల్లికి అప్పగించారు. కిడ్నాప్‌కు పాల్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా గులుగొండ మండలం, నాగపురం గ్రామానికి చెందిన పులెజి నూకరాజు శివ
(30)ను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు పంపించారు.