క్రైమ్/లీగల్

అసత్య ప్రచారంపై నటి లావణ్య ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: సునిషిత్ అనే వ్యక్తి తనపై ఆసత్య ప్రచారం చేస్తున్నాడని నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునిషిత్‌ను నేను పెళ్లి చేసుకొన్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో లావణ్య పేర్కొంది. త్రిపాఠి తన అసిస్టెంట్ ద్వారా కంప్లైంట్‌ను పోలీసులకు పంపించింది. యూట్యూబ్ చానెల్స్‌లో సునిషిత్ చేసిన వాఖ్యలను పరిశీలించామని, మహిళలపై అసభ్యంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదని ఆమె హెచ్చరించారు. సునిషిత్ ఇతర సెలెబ్రిటీలపై కూడా వాఖ్యలు చేశారు. కానీ ఇప్పటి వరకు లావణ్య మాత్రమే ఫిర్యాదు చేసింది. లావణ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ పేర్కొన్నారు.
*చిత్రం...నటి లావణ్య