క్రైమ్/లీగల్

చొరబాటుదారులను పంపించి వేయడం మా బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: దేశంలోకి అక్రమంగా వచ్చిన చొరబాటుదారులను గుర్తించి పంపించివేయటం తమ సార్వభౌమ, చట్టబద్దమైన, నైతిక బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ఎన్‌ఆర్‌సీ (నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్) తయారు చేయడం అత్యంత అవసరమైన ప్రక్రియ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అక్రమ వలసదారులను కనుగొని గుర్తించడం తమ బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం తమ కౌంటర్ పిటిషన్‌లో స్పష్టం చేసింది. దేశ పౌరులు కాని వారిని గుర్తించేందుకు పౌరుల జాతీయ రిజిష్టరును తయారు చేయడం ప్రతి సార్వభౌమ దేశానికి ఎంతో అవసరమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో మూడు రకాల పౌరులు జీవిస్తున్నారు, దేశ పౌరులు, అక్రమ చొరబాటుదారులు, చెల్లుబాటు వీసాలతో ఉంటున్న విదేశీయులని కేంద్ర ప్రభుత్వం తమ కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్నది. అందుకే విదేశీయుల చట్టం, పాస్‌పోర్టు చట్టం, 1955 చట్టం ప్రకారం అక్రమ వలసదారులను పసిగట్టి గుర్తించి ఆ తరువాత తదుపరి ప్రక్రియను పూర్తి చేయడం తమ గురుతర బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యాంగంలోని 14-ఏ, దానిలోని నియమ, నిబంధనల ప్రకారం భారతీయ పౌరులను రిజిష్టరు చేసి జాతీయ గుర్తింపుకార్డు ఇవ్వాల్సి ఉన్నదని కేంద్రం తెలిపింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు పలు ఇతర దేశాల్లో తమ పౌరుల రిజిష్టరు నిర్వహించటం, జాతీయ గుర్తింపుకార్డులు ఇచ్చే విదానం అమలులో ఉన్నదని కేంద్రం తెలిపింది. విదేశీయులను దేశం నుండి బహిష్కరించే సర్వాధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయని కౌంటర్ అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 ప్రకారం పౌరసత్వం ఇవ్వటం, తొలగించటం తదితర అంవాలకు సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉన్నదన్నారు. ఆర్టికల్ 11కు లోబడి 1955లో చేసిన పౌరసత్వ చట్టం ప్రకారం ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి, ఎవరి పౌరసత్వం రద్దు చేయాలనేది ఇది వరకే నిర్దారించబడిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 1955లో చేసిన పౌరసత్వ చట్టానికి ఇంత వరకు 9 సవరణలు జరిగాయని కోర్టుకు తెలిపారు. తమ,తమ దేశాలలోని మైనారిటీలను రక్షించేందుకు కుదుర్చుకున్న నేహ్రు, లియాఖత అలీ ఒప్పందాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం అమలు చేయలేదు, కేంద్ర ప్రభుత్వం 1964లో ఈ విషయాన్ని సుస్పష్టం చేసిందని కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలోని హిందు, సిక్కు తదితర మైనారిటీలకు పూర్తి భద్రత, సమానత్వం కల్పించటం లేదు, అందుకే వారికి భారతీయ పౌరసత్వం కల్పించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం 1964లోనే ఒక అభిప్రాయానికి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.