క్రైమ్/లీగల్

ఈతకు వెళ్లి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, మార్చి 21: క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు మృతిచెందారు. జవహర్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం సీఆర్‌పీఎఫ్ ప్రాంతంలోఅరుణ్‌జ్యోతీ కాలనీలో మట్టి కోసం అక్రమంగా గుంతలను తీశారు. గుంతల్లో వర్షం నీరు చేరుకోవడంతో అదే ప్రాంతానికి చెందిన రాహుల్(9), హేమంత్ (12) అనే ఇద్దరు విద్యార్థులు ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు ఇరుక్కపోయారు. దీంతో ఊపిరి ఆడక ఆ క్వారీలో ప్రాణాల కోల్పోయారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతులను బయటకు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ నాలుగో తరగతి, హేమంత్ ఆరో తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.