క్రైమ్/లీగల్

వెల్దండలో లక్ష రూపాయల పట్ట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, నవంబర్ 12: వెల్దండ మండలం రాఘయిపల్లి బస్సుస్టేజి సమీపంలో సోమవారం సాయంత్రం ఓక్క లక్షా 8వేల రూపాయలను పట్టుకున్నాట్లు ఎస్సై పెండెం వీరబాబు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఏన్నికల దృష్ట్యా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనీఖీలు నిర్వహిస్తుండగా టీఎస్08ఎక్స్4434గల కారులో ఘట్కేసర్ మండలం నారపల్లి గ్రామానికి చెందిన పానుగంటి సిద్దయ్య అను కాంట్రాక్టర్ రూ.1.8లక్షలు తీసుకెళ్తుండగా రెడ్ హ్యడెండ్‌గా పట్టుకోని ప్లయింగ్ స్క్వాడ్ అధికారి వెల్దండ నయాబ్ తహశీల్దార్ వెంకటరమణకు అప్పజెప్పినట్లు ఎస్సై వీరబాబు తెలిపారు. ఇప్పటి వరకు 7లక్షాల 19వేల 500రపాయలను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక చెక్‌ఫోస్టును వెల్దండ సిఐ గిరికుమార్‌కల్కొటా తనిఖీ చేసి అక్కడి సిబ్బందిని అభినందించారు. అదే విధంగా చెక్ పోస్టు సిబ్బంది నాగయ్య, మహమూద్, యూసుఫ్, రమేష్‌బాబులను సిఐ గిరికుమార్‌కల్కొటాతో పాటు ఎస్సై పండెం వీరబాబులు ప్రత్యేకంగా అభినందించారు.