క్రైమ్/లీగల్

శ్రీకాళహస్తి శ్రీరామ్‌నగర్ కాలనీ ఇంట్లో భారీ దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 17: శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీలో తొట్టంబేడు జడ్పీటీసీ సభ్యురాలు అనుసూయమ్మ కుమారుడి ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ఈ సంఘటనలో సుమారు 38లక్షల రూపాయలు నగదు, 12లక్షలు విలువ చేసే రెండు వజ్రాల గాజులు వెరసి 50లక్షల రూపాయల భారీ దోపిడీ జరిగింది. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ రామకృష్ణ, రూరల్ సీఐ సుదర్శనప్రసాద్, ఎస్‌ఐ భగవాన్‌లు, చిత్తూరు డాగ్‌స్క్వాడ్, తిరుపతి వేలిముద్ర నిపుణులతో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు జాగిలాలు ఆ ఇంటికి సమీపంలోని బైసాస్‌రోడ్డు వరకు వెళ్లి వెనక్కు వచ్చాయి. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ గుర్రప్పనాయుడు సోదరి, తొట్టంబేడు జడ్పీటీసీ అనసూయమ్మ, ఆమె భర్త శ్రీనివాసులునాయుడులు తొట్టంబేడు మండలంలోని కొణతనేరిలో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు చలపతినాయుడు చెన్నైలో ఇండియన్ సిమెంట్స్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో చలపతినాయుడు, తండ్రి శ్రీనివాసులునాయుడులు శ్రీకాళహస్తిలో సిమెంట్ ఏజెన్సీ కూడా నడుపుతున్నారు. చలపతినాయుడుకు శ్రీరామ్‌నగర్ కాలనీలో ఒక గృహం ఉంది. ఇటీవల కాలం వరకు కాళహస్తి ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ గుర్రప్పనాయుడు ఆ ఇంట్లో నివాసం ఉండేవారు. కొత్త ఇళ్లు కట్టుకున్న తరువాత ఆయన ఇళ్లు ఖాళీ చేశారు. ఈ నేపధ్యంలో చలపతినాయుడు చెన్నైలో ఉండటంతో ప్రతిరోజు ఆయన తండ్రి శ్రీకాళహస్తిలో వ్యాపార లావాదేవీలు చూసుకుని శ్రీరామ్‌నగర్ కాలనీలోని ఇంటికి వచ్చి 11గంటల వరకు ఉండి ఇంటికి వెళ్లేవారు. ఆదివారం నాడు కూడా శ్రీనివాసులునాయుడు రాత్రి 11గంటల వరకు శ్రీరామ్‌నగర్‌కాలనీలోని ఇంట్లో ఉండి వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికివెళ్లే సమయానికి ఇంటి ప్రధాన ద్వారం తాళాలతో పాటు, లోపలున్న ఐదు ద్వారాల తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. సిమెంటు విక్రయించి వచ్చిన సొమ్మును కంపెనీకి జమచేయడానికి బీరువాలో ఉంచిన 38లక్షల రూపాయలతో పాటు 12లక్షల రూపాయలు విలువ చేసే రెండు వజ్రాల గాజులు చోరీ అయి ఉండటాన్ని గుర్తించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ రామకృష్ణ, తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలు సేకరిస్తున్నామని, త్వరలోనే కేసు ఛేదించి వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ విలేఖరులకు తెలిపారు.