క్రైమ్/లీగల్

ఏలూరులో విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 17 : విజిలెన్స్ అధికారులు ఏలూరు ప్రాంతంలో సోమవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదేపల్లి రోడ్డులోని గాయత్రి నగర్‌లో ఒక టిపొడి గోడౌన్‌పై దాడిచేసి కల్తీ టిపొడిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని లక్షా 83 వేల రూపాయలు విలువచేసే 1300 కేజీల కల్తీ టిపొడిని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏలూరు మినీ బైపాస్ రోడ్డులోని రామకృష్ణాపురం సమీపంలో ఒక కల్తీ నెయ్యి కేంద్రంపై దాడులు నిర్వహించి కల్తీ నెయ్యితోపాటు దాని తయారీకి ఉపయోగించి పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయిదు కేజీల నెయ్యికి 10 కేజీల పామాయిల్, 10 కేజీల డాల్డా కలిపి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఒక ఇంటిని అద్దెకు తీసుకుని రోజుకు 50 కేజీల కల్తీ నెయ్యిని తయారు చేసి వాటిని ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారుల విచారణలో తేటతెల్లమైంది. గాయత్రీనగర్‌లో చేసిన దాడుల్లో విజిలెన్స్ సిఐ ఎంవి భాస్కరావు, ఎస్‌ఐ ఏసుబాబు, రామకృష్ణాపురంలో జరిపిన దాడుల్లో విజిలెన్స్ సిఐ జివి నాగేశ్వరరావు, ఎస్‌ఐ కె సీతారాము, ఎజి జయప్రసాద్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.