క్రైమ్/లీగల్

కళ్ళంవారిపాలెంలో రెండు ఇళ్ళల్లో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, సెప్టెంబర్ 17: మండలంలోని చాగంటిపాడు కళ్ళంవారిపాలెంలో ఆదివారం రాత్రి తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో చోరి జరిగింది. అలాగే తోట్లవల్లూరు గ్రామంలో 5 గొర్రెలను అపహరించారు. కళ్ళంవారిపాలెంలో పాములపాటి పిచ్చిమ్మ, పాములపాటి బసివిరెడ్డి ఇళ్ళల్లో చోరీలకు దొంగలు తెగబడ్డారు. పిచ్చిమ్మ, బసివిరెడ్డి హైదరబాద్‌లోని కుమారుల వద్దకు వెళ్లారు. సుమారు 15 రోజుల నుంచి రెండిళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. పిచ్చిమ్మ ఇంటి తాళాలు పగులకొట్టి దొంగలు వెంట తెచ్చిన పలుగుతో బీరువాని తెరిచి లాకరుని బయటకు తీశారు. బీరువాలో ఉన్న 4 గ్రామలు బంగారు సూత్రం, పావుకిలో వెండి వస్తువులను, ఎల్‌ఈడి టీవిని అపహరించారు. అనంతరం బసివిరెడ్డి ఇంటి తాళాలను పగులకొట్టి బీరువాని తెరిచారు. కాని లాకరు ఓపెన్ కాక వదిలేశారు. సోమవారం ఉదయం కరెంటు మీటరు రీడింగ్ తీసిన వ్యక్తి బిల్లుని తలుపు గొళ్లెం వద్ద పెట్టబోగా తాళం పగులకొట్టి ఉండటాన్ని గమనించా ప్రక్కన బంధువులకు తెలిపాడు. దీంతో బంధువులు ఎస్‌ఐ మురళీకి సమాచారం అందించారు. ఏసీపీ విజయభాస్కర్, సీఐ సత్యానందం కళ్ళంవారిపాలెం వచ్చి రెండు గృహాలను పరిశీలించారు. క్లూస్‌టీంని రప్పించి ఆధారాలు సేకరించారు. అలాగే తోట్లవల్లూరులో వల్లూరు ఫ్రాన్సీస్, కొడుకు విజయకుమార్ ఇంటి ఆవరణలోని 5 గొర్రెలను అపహరించుకు పోయారు. దీంతో సోమవారం ఎస్‌ఐ మురళీ పరిశీలించారు.

కోడూరులో రెండు పాము కాటు కేసులు నమోదు
కోడూరు, సెప్టెంబర్ 17: మండల పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన కోనేరు సుబ్బారావు సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్లి పాము కాటుకు గురయ్యాడు. హరిపురం గ్రామానికి చెందిన వేనేటి హర్షవర్ధన్ (11) తోటి పిల్లలతో గ్రామంలో ఆడుతుండగా త్రాచుపాము కాటు వేసింది. వెంటనే కోడూరు పీహెచ్‌సీకి తరలించగా వైద్యాధికారిణి రుబీనా మునాఫ్ ఇద్దరికి రక్త పరీక్షలు చేసి యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్ ఇచ్చి పరిశీలనలో ఉంచారు.