క్రైమ్/లీగల్

ప్రేమ విఫలం యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ విఫలంకావడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పీఎన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కొల్లు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లవ్‌కేశ్ కుమార్‌కోల్ (21) పక్షం రోజుల క్రితం వరుసకు సోదరుడైన బేతు రావత్‌కోల్ వద్దకు జీవనోపాధి నిమత్తం వలసవచ్చాడు. మేడ్చల్ పారిశ్రామికవాడలో ఓ అల్యూమినియం కంపెనీలో పనిచేస్తూ అక్కడే క్వార్టర్స్‌లో సంజయ్ కోల్‌తో కలిసి ముగ్గురు నివాసం ఉంటున్నారు. బేతు రావత్‌కోల్, సంజయ్ కోల్ సోమవారం ఇద్దరు మధ్యాహ్నం షిఫ్ట్‌కు వెళ్లగా లవ్‌కేశ్ రూమ్‌లోనే ఉన్నాడు. మధ్యాహ్నం అతడికి రావత్ భోజనం కూడా తెచ్చి ఇచ్చాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మెషీన్ అపరేటర్ అజ్‌దేశ్ రాయ్ బాతురూమ్‌కని వెళ్లగా పైకప్పు ఇనుపరాడ్‌కు టవల్‌తో లవ్‌కేశ్ మెడకు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే విషయాన్ని రావత్‌కు తెలుపడంతో సంజయ్, రావత్, రాకేశ్ వచ్చి లవ్‌కేశ్‌ను కిందకు దించి రూమ్‌కి తరలించగా అప్పటికే విగతజీవిగా మారాడని గుర్తించారు. లవ్‌కేశ్ తరచూగా ఓ అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడే వాడని ప్రేమ విఫలం కావడంతో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాని వరుసకు సోదురడైన రావత్ కోల్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొల్లు నాయుడు తెలిపారు.