క్రైమ్/లీగల్

వైద్యం పొందుతూ చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, అక్టోబర్ 1: పట్టణంలోని బస్టాండ్ సమీపం వద్ద ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న మూడు నెలల చిన్నారి మృతి చెందాడు. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లనే తన కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద బాధితులు ధర్నా నిర్వహించారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకుంది. ఈ సంఘటనకు సంబందించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని ములకపెంటకు చెందిన సరోజ, రాముడు దంపతుల కుమారుడు మూడు నెలల చిన్నారికి గత రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం తీసుకుని వచ్చారు. చిన్నారికి అతిగా జ్వరం రావడంతో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ వైద్యులు చికిత్సలు నిర్వహించారు. అయితే ఆదివారం రాత్రి చిన్నారికి విపరీతంగా ఏడుస్తుండటాన్ని గమనించిన సరోజ ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించింది. వైద్యులు వచ్చి చూడాలని కోరింది. అయితే ప్రతిసారి వైద్యులు వచ్చి చూడటం కుదరదని, కనీసం వైద్య పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేయడంతో చిన్నారి ముక్కు నుండి రక్తం వచ్చి చిన్నారి మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. చిన్నారి మృతికి కారణమైన ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ పట్టణ కార్యదర్శి వీరభద్రస్వామి ఆధ్వర్యంలో బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో సమాచారం అందుకున్న అర్బన్ సీఐ రాజా సంఘటన స్థలానికి చేరుకుని వైద్యులు, బాధితులతో చర్చించారు. చిన్నారి మ్యాంకో లైటీస్ అనే వ్యాధి సోకిందని, చిన్నారికి వైద్య సేవలు అందించామన్నారు. ఈ విషయాన్ని బాధితులకు వివరించామన్నారు. దీంతో ఇరు వర్గాలతో సీఐ చర్చలు నిర్వహించారు.

సెల్ఫీ సరదాతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

తనకల్లు, అక్టోబర్ 1: సీజీ ప్రాజెక్ట్ వద్ద సోమవారం కొందరు యువకులు సరదాగా సెల్ఫీలు తీసుకుంటూ అదమరిచి షాకీర్ (18) నీట మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తనకల్లు మండలం మారప్పగారిపల్లికి చెందిన మస్తాన్ కుమారుడు షాకీర్ అతని స్నేహితులతో సీజీ ప్రాజెక్ట్ చూడడానికి సరదాగా వెళ్లాడు. అక్కడ సీజీ ప్రాజెక్ట్ గేట్ల వద్ద సరదాగా సెల్ఫీ తీసుకుంటుండగా షాకీర్ నీటిలో పడిపోవడంతో ఈత రాక నీటిలోనే మునిగిపోయాడు. షాకీర్‌ను కాపాడడానికి తోటి స్నేహితులు విషయాన్ని సమీప గ్రామస్థులకు తెలియజేయడంతో గ్రామానికి చెందిన యువకులు షాకీర్ శవాన్ని వెలికితీశారు. ఎస్‌ఐ నాగేంద్ర కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆటోలు ఢీ నలుగురికి గాయాలు
పెద్దవడుగూరు, అక్టోబర్ 1: మండలంలోని మిడ్తూరు, పెద్దవడుగూరు రహదారిలో సోమవారం ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోలు పరస్పరం ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నారాయణమ్మ, నారాయణస్వామి, మదార్‌సాలకు రక్త గాయాలు కాగా, మిగిలిన వారికి స్పల్ప గాయాలయ్యాయి. వీరిని వెంటనే గుత్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సను అందించారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స చేసారు. ప్రమాద ఘటన తీరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌రెడ్డి తెలిపారు.

యువకుడి శవానికి అంత్యక్రియలు

హిందూపురం టౌన్, అక్టోబర్ 1: పట్టణంలోని సీఅండ్‌ఐజీ మిషన్ చర్చి ఆవరణలో మృతి చెందిన ఓ యువకుడి మృతదేహానికి ప్రజా సంఘాల ప్రతినిధులు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. కర్నాటక గౌరిబిదనూరు తాలూకా వాటంకొత్తపల్లికి చెందిన బోయ వెంకటేష్ తన తల్లితో కలిసి భిక్షాటన చేసుకొంటూ జీవనం సాగించేవాడు. అయితే అనారోగ్యంతో ఆయన మృతి చెందగా వన్‌టౌన్ సీఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని తల్లికి అప్పగించగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో సీఐ ఈ విషయాన్ని లైఫ్ వరల్డ్ చారిటబుల్ ట్రస్టు కన్వీనర్ ఉదయ్‌కుమార్, ముస్లిం నగారా ఛైర్మన్ ఉమర్‌ఫరూఖ్‌ల దృష్టికి తీసుకెళ్లారు. చరణ్ ఫౌండేషన్ ఛైర్మన్ చలపతి ఆర్థిక సహాయంతో మృతదేహాన్ని శ్రీకంఠపురం శ్మశాన వాటికకు తరలించి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరు ఫ్యాన్స్ అమర్‌నాథ్, టైలర్ గంగాధర్, కానిస్టేబుళ్లు చలపతి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

ఆరుగురు మట్కా బీటర్లు అరెస్టు

హిందూపురం టౌన్, అక్టోబర్ 1: పట్టణంలోని పరిగి బస్టాండ్‌లో మట్కా నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఆరుగురు బీటర్లను అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ సీఐ చిన్న గోవిందు తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పరిగి బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా దాదాపీర్, నరసింహమూర్తి, రవికుమార్, వెంకటేష్, ఇలియాజ్, బాబాసాబ్ అనే వ్యక్తులను ప్రజలను మోసం చేస్తూ మట్కా కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకొని వారి నుండి రూ.85,500 నగదు, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. కాగా శీనప్ప అనే మట్కా నిర్వాహకుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని కూడా అరెస్టు చేయనున్నట్లు సీఐ తెలిపారు.

విద్యార్థుల ఆత్మహత్యాయత్నం

హిందూపురం రూరల్, అక్టోబర్ 1: హిందూపురం రూరల్ మండల పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమో చదువుతున్న ధనుంజయ, సురేష్‌నాయక్ అనే విద్యార్థులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ విద్యార్థులు ఇరువురు డిప్లమో రెండో సంవత్సరం చదువుతూ మూడో ఏడాదికి ప్రమోట్ కావాల్సి ఉంది. అయితే కళాశాల యాజమాన్యం హాజరు తక్కువగా ఉందని, ప్రమోట్ చేయలేమని పేర్కొంది. దీంతో మనస్తాపానికి గురైన ధనుంజయ, సురేష్‌నాయక్‌లు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అయితే తోటి విద్యార్థులతోపాటు విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ విద్యార్థులను అదుపులోకి తీసుకొని రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే యాజమాన్యం తీరు పట్ల విద్యార్థి సంఘాల నాయకులు పోలీసు స్టేషన్‌లో నిరసన వ్యక్తం చేశారు.

లారీ బోల్తా తప్పిన పెద్ద ప్రమాదం

యాడికి, ఆక్టోబర్ 1: మండల పరిధిలోని రాయలచెరువు, వేమలపాడు ప్రధాన రహదారి వద్ద అదుపుతప్పిన లారీ బొల్తాపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల మేరకు హర్యాణా రాష్ట్రానికి చెందిన లారీ ముంబై నుండి చెన్నైకి రాయల్‌ఫీల్డ్ వాహనాల బేరింగ్‌ల లోడుతో వెళుతున్న లారీ రాయలచెరువు బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి బొల్తాపడింది. అయితే ఇందులో డ్రైవర్, క్లీనర్లకు స్పల్పగాయాలతో బయటపడ్డారు. అదే రైల్వే బ్రిడ్జిపై పడి ఉంటే పెద్ద ప్రమాదం సంబవించేందని స్థానికులు తెలిపారు. అయితే ఈ సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ ఫణీంద్రనాథ్‌రెడ్డి పరిశీలించి దర్యాప్తుచేస్తున్నారు.