క్రైమ్/లీగల్

తిరుపతి కరకంబాడి వద్ద రూ. 2కోట్ల విలువచేసే 112 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 1: కరకంబాడి అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లపై అటవీశాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 2కోట్లు విలువచేసే 112 ఎర్రచందనం దుంగలు, లారీని స్వాధీనం చేసుకున్నారు. కరకంబాడి ప్రాంతంలో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఓ లారీ అటుగా రావడం గమనించిన అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది గమనించిన లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. దీంతో లారీని, అందులోని ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్ఫోర్స్, పోలీస్, అటవీశాఖ అధికారుల అప్రమత్తతంతో స్మగ్లర్ల ఆటకట్టు
శేషాచల అడవుల్లో గతంలో విచ్చలవిడిగా ఎర్రచందనం అక్రమ రవాణా చేసే స్మగ్లర్ల గుండెల్లో టాస్క్ఫోర్స్, పోలీస్, అటవీశాఖ అధికారులు రైళ్లను పరిగెత్తిస్తున్నారు. ముఖ్యంగా టాస్క్ఫోర్స్ సిబ్బంది చేస్తున్న విశేషమైన కృషితో ఎర్రచందనం అక్రమరవాణాను అడ్డుకోవడంలో మంచి ఫలితాలను రాబడుతున్నారు. విస్తారంగా ఉన్న శేషాచల అడవుల్లో స్మగ్లర్లు చెట్లు నరకడాన్ని ఆపలేకపోతున్నా... రవాణాను అడ్డుకోవడంలో టాస్క్ఫోర్స్, అటవీశాఖ, పోలీస్ సిబ్బంది చేస్తున్న కృషి ప్రశంసలు అందుకుంటోంది. ఒక వైపు పట్టు వదలని విక్రమార్కుల్లా స్మగ్లర్లు వందలు, వేల సంఖ్యలో అడవుల్లోకి ప్రవేశిస్తున్నా పదుల సంఖ్యలో ఉన్న సిబ్బంది మాత్రం వారి ఆటకట్టిస్తున్నారు. సిబ్బందిని పెంచి వారికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న ఆయుధాలతోపాటు ప్రత్యేక అధికారాలు ఇస్తే స్మగ్లర్లకు పూర్తిస్తాయిలో నిరోధించగలరని మేధావులు అభిప్రాయ పడుతున్నారు.