క్రైమ్/లీగల్

భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన బీజేపీ నగరాధ్యక్షుడిపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 1: బీజే పీ నగరాధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పార్టీకి చెందిన మరికొందరు నేతలపై సూర్యారావుపేట పోలీసులు కేసులు న మోదు చేశారు. తన ప్రమాణస్వీకారం సందర్భంగా భద్రతా ప్రమాణాలు పా టించనందున బాణసంచా కాల్చి అగ్నిప్రమాదానికి కారణమైనందుకు బా ధ్యులను చేస్తూ ఈ కేసులు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలకు తావు లే కుండా ముందస్తు భద్రతా చర్యల్లో భా గంగా ట్రాఫిక్‌కు ఎలాంటి అవాంతరా లు కలగకుండా ఉండేందుకు ఊరేగింపులు, బహిరంగ సభలు, ధర్నాలు ని ర్వహించే సమయాల్లో ఎలాంటి బాణసంచా కాల్చరాదని నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఇ ప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయి తే బీజేపీ నగరాధ్యక్షుడిగా నియమితులైన అడ్డూరి శ్రీరామ్ పదవీ ప్రమాణస్వీకారం సందర్భంగా సెప్టెంబర్ 30న ఐవీ ప్యాలెస్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదని పోలీసులు గుర్తించారు. ప్రమాణస్వీకారం జరుగుతున్న ఫంక్షన్ హాలుపైన బాణసంచా కాల్చడం వల్ల అక్కడ భోజనాల కోసం ఏర్పాటు చేసిన టెంట్‌కు మంటలు అంటుకుని దగ్ధమైంది. వెంటనే అక్కడ ఉన్న వ్యక్తులు అప్రమత్తమై మంటలు ఆర్పివేయడం ద్వారా ప్రాణహాని తప్పింది. దీంతో పోలీసులు ముందుగా హెచ్చరించినా వినకుండా నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా కాల్చి అగ్నిప్రమాదానికి కారణమైన అడ్డూరి శ్రీరామ్, మరికొందరిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆర్టీసీ డ్రైవర్‌కు జైలు, జరిమానా
విజయవాడ (క్రైం), అక్టోబర్ 1: ఒకరి మృతికి కారకుడైన ఆర్టీసీ డ్రైవర్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.2500 వేలు జరిమానా విధిస్తూ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కంకిపాడు మండలం కోమటిగుంట సమీపంలో కంకిపాడు నుంచి భీమవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు 2013 ఏప్రిల్ 11న ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో తాపి కార్మికుడు కనుమూరి బుల్లియ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన కఠారి పానకాలరావు (40)ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో నిందితుడిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.
చీటీల పేరుతో మోసగించిన వ్యక్తికి రెండేళ్లు జైలు, జరిమానా
విజయవాడ (క్రైం), అక్టోబర్ 1: చీటీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితునిపై నేరం రుజువుకావడంతో రెండేళ్ల జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం పెనమలూరు పల్లిపేటకు చెందిన దాసరి నాగరాజు (24) అనే వ్యక్తి ఇదే ప్రాంతానికి చెందిన పలువురి వద్ద నుంచి చీటీల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. 20నెలల పాటు ప్రతి నెలా మల్లికార్జునకు ఖాతాదారులు డబ్బు చెల్లిస్తూ వచ్చారు. గడువు ముగిసినా పాటదారులకు డబ్బులు తిరిగి చెల్లించుకుండా మోసం చేయడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరుఫున పోలీసులు ప్రవేశపెట్టిన 12మంది సాక్షులను విచారించిన మీదట నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పింది.