క్రైమ్/లీగల్

వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, అక్టోబర్ 1: ఇంట్లో అద్దెకు చేరి ... ఇంటి యజమానులైన వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి, ఇంట్లోని నగదు, బంగారం దోచుకెళ్లిన సంఘటనతోపాటు, ఇంటి యజమాని కళ్యాణి శంకర్ (70) అనుమానాస్పద స్థితిలోమృతి చెందిన సంఘటన, ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని బీసీ కాలనీలోచోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై ఉపేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి బీసీ కాలనీలో కళ్యాణి శంకర్ అతని భార్య ఇందిరమ్మ అనే వృద్ధ దంపతుల ఇంట్లో వారం రోజుల క్రితం గణేష్, లక్ష్మి అనే దంపతులు ఒక పాపతో అద్దెకు చేరారు. వృద్ధ దంపతులతో మంచిగా కలుపుగోలుగా ఉంటూ, ఆదివారం చీకటి పడే సమయంలో గణేష్ రెండు సీసాల కల్లును తీసుకు వచ్చి వృద్ధ దంపతులచే ఒక సీసా మత్తుమందు కలిపిన కల్లు తాగించి, ఇంకొకటి వారు తాగారు. వృద్ధ దంపతులు తలుపు గొళ్లెం వేసి నిద్రమత్తులోకి జారుకున్నారు. అర్ధరాత్రి సమయంలో పక్కనే గల తలుపుగొళ్లెం పగులగొట్టి వృద్ధ దంపతుల ఇంట్లో దూరి ఇందిరమ్మ మెడలోంచి రెండున్నర తులాల పుస్తెల తాడు, బీరువాలోంచి ఐదు వేల నగదు, బట్టలు, సామన్లను తీసుకుని పారిపోయారు. తెల్లవారుజామున ఇందిర లేచి చూడగా తలుపులు తీసి ఉండటంతోపాటు భర్త శంకర్ కింద పడి గురక పెడ్తు పడిఉన్నాడని, నోట్లోంచి నల్లని నురగ రావడం గమనించి, దొంగతనం జరిగినట్లుగుర్తించి చుట్టుప్రక్కల వారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మాజీ జడ్పీటీసీ షేక్ గయాజుద్దిని సంఘటన స్థలానికి చేరుకుని, 108కు సమాచారం అందించారు. 108వాహనం వచ్చేలోగానే శంకరయ్య అనుమానాస్పద స్థితిలోమృతి చెందాడన్నారు. మృతదేహాన్ని స్థానికప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్య ఇందిర ఫిర్యాదు మేరకు 457, 38 ఐపిసీ కింద దొంగతనం కేసును, 304 పార్ట్2 కింద అనుమానాస్పద స్థితిలోమృతి చెందినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. వృద్ధ దంపతులకు కల్లులోమత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడి, అనుమానస్పద స్థితిలోమృతి చెందిన శంకర్ ఇంటిని, సోమవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి, స్థానిక డీఎస్పీ ఈ.చంద్రశేఖర్‌గౌడ్ పరిశీలించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.