క్రైమ్/లీగల్

పిడుగుపాటుతో 35 గొర్రెలు యువకుడి మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెక్కొండ,అక్టోబర్ 1: అకాల వర్షం ఆ రెండు కుటుంబాలను ఆగం చేసింది. సోమవారం సాయం త్రం కురిసిన భారీ వర్షానికి తోడు పిడుగుపడటంతో నెక్కొండ మండలం అమీన్‌పేట, సూరిపెల్లి గ్రామా ల్లో భారీ నష్టం చోటుచేసుకుంది. అమీన్‌పేటలో చిలపూరి వెంకన్నకు చెందిన 35 మేకలు, గొర్రెలు పిడుగుపాటుతో మృత్యువాతపడ్డాయి. ఒక్కసారిగా వర్షం ఎక్కువవడంతో గొర్రెల మందను సమీపంలోని చెట్టుదగ్గరికి తరలించగా పిడుగుపడి రూ.2లక్షల మేర విలువైన జీవాలు మృతిచెందాయి. ఈ ఘటన లో గొర్రెల కాపరి వెంకన్న సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.
షూటింగ్ చూడటానికి వెళ్లి...
మండలంలోని సూరిపెల్లికి చెందిన పూజరి కళ్యా ణ్ (33) తమ గ్రామానికి సమీపంలోని లింగగిరి గుట్టపై ఓ టీవి చానల్ షూటింగ్‌ను చూడటానికి వెళ్లి మృత్యువాతపడ్డాడు. షూటింగ్ పూర్తయిన అనంతరం వర్షం రావడంతో కొందరు గ్రామస్థులు ఆలయంలోకి వెళ్లగా కళ్యాణ్ తన మిత్రుడితో కలిసి గుట్టదిగి కిందికి వస్తున్నాడు. సమీపంలో పిడుగుపడటంతో షాక్‌కు గురై కళ్యాణ్ మృత్యువాతపడ్డాడు.