క్రైమ్/లీగల్

ఇద్దరు బాలురు అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, అక్టోబర్ 1: ఇద్దరు బాలురు అదృశ్యమైన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. సిఐ కిషన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్‌కి చెందిన తర్కేవ్వర్ పాండే బాలానగర్ రంగారెడ్డి నగర్‌లో నివాసముంటూ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు రవిరాజన్ (12) స్థానిక రెయిన్ బో పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు.
అదే ప్రాంతంలో ఉంటున్న మనీష్ శర్మ (11) సెయింట్ ఇసాక్ పాఠశాలలో చదువుతున్నాడు. వీరిద్దరూ కలిసి వారి వారి పాఠశాలలకు వెళ్ళి వచ్చేవారు. కాగా శనివారం ఇద్దరూ కనిపించకుండా పోయారు. స్థానిక వాసులను, చిన్నారుల స్నేహితులను విచారించినా ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు బాలానగర్ పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
వికారాబాద్, సెప్టెంబర్ 1: గాయపడిన వృద్ధురాలు మృతిచెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సీతయ్య తెలిపిన వివరాల ప్రకారం గత నెల 29న రజియాబీ(61), ఇస్మాయిల్ స్కూటీపై ఆలంపల్లి నుంచి శివారెడ్డిపేటకు బయలుదేరారు. ఎనె్నపల్లి వద్ద చీకటిలో కనిపించకోవడంతో గేదెను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన రజియాబీని ముందుగా వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
ఉప్పల్, అక్టోబర్ 1: రహస్య ప్రదేశంలో నిషేద గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని ఉప్పల్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ పోచారానికి చెందిన ఎండీ.సర్వర్ ఖాన్ (48) ఉప్పల్ ఐడీఏలో విక్రయిస్తుండగా అందిన సమాచారం మేరకు అదుపులోకి తీసుకుని విచారించగా బయటపడింది. 650 గ్రాముల గంజాయితో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.
బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల
* రూ.1.32 లక్షల నగదు, 25 తులాల ఆభరణాలు చోరీ
రాజేంద్రనగర్, అక్టోబర్ 1: బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి చూసే సరికి ఇల్లు గుల్ల అయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారు అత్తాపూర్ ఎర్రబోడ ఏజీ కాలనీలో హెచ్‌సిఎల్ కంపెనీ మాజీ ఉద్యోగి నాగేశ్వరరావు నివసిస్తున్నాడు.
ఆదివారం నాగేశ్వరరావు భార్యతో కలిసి స్థానికంగా నివసించే బంధువుల ఇంటికి వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం తీసి ఉండడాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో సామాన్లు చిందరబందరగా పడేసి ఉన్నాయి. బీరువలో ఉండాల్సిన వస్తువులు కనిపించకపోవడంతో నాగేశ్వరరావు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరుతెన్నులను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనంలో సుమారు 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.32 లక్షల నగదు అపహరించారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం

మేడ్చల్, అక్టోబర్ 1: లారీ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కొల్లు నాయుడు కథనం ప్రకారం ఆదివారం రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో కండ్లకోయ జంక్షన్ వద్ద లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడన్న సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.
దుర్మరణం చెందిన వ్యక్తి వివరాలు తెలియరాలేవు. మృతుడికి సుమారు 30 సంవత్సరాల వయస్సు ఉంటుందని, ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తి మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొల్లు నాయుడు తెలిపారు.

ఐడీఏలో విలువైన స్థలం కబ్జాకు యత్నం

ఉప్పల్, అక్టోబర్ 1: ఉప్పల్ పారిశ్రామిక వాడలోని శ్రీ దుర్గా మల్లిఖార్జున స్వామి ఆలయం కింది భాగంలో విలువైన స్థలం కబ్జాకు గురవుతోంది. ఆలయం పరిధిలోని ఖాళీ స్థలాన్ని పక్కన ఉన్న పారిశ్రామికవేత్త తనకు సంబంధంలేకుండానే శుభ్రం చేసి కబ్జాకు యత్నిస్తున్నారని ఆలయ ఈవో భాగ్యలక్ష్మి సోమవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఈ స్థలం ఇండస్ట్రీయల్‌కు చెందినదా లేక ఆలయానికి కేటాయించారా అన్న విషయంలో స్పష్టత లేదు. స్థలమెమరిదీ అన్న విషయంలో విచారణ జరిపి విలువైన స్థలాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.