క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్ట్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, అక్టోబర్ 8: స్థానిక రామకృష్ణ కూడలి సబ్‌స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు వేణుగోపాలపురంకు చెందిన మురళి కుమారుడు జ్యోతి (19) ద్విచక్ర వాహనంపై మితిమీరిన వేగంతో రామకృష్ణాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వెళుతుండగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఇనుప కమీపై పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతిచెందాడని, మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం తిరుపతి రుయాకు తరలించి రేణిగుంట ఎస్‌ఐ ఇమ్రాన్ బాషా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.