క్రైమ్/లీగల్

ఇలపకుర్రులో గుడిసెల తొలగింపు: ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, అక్టోబర్ 8: యలమంచిలి ఇలపకుర్రు గ్రామంలోని కుమ్మరిపాలెం సరిహద్దులో దొడ్డిపట్ల వాసులకు పట్టాలు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పట్టాలు లేని వారు గత వారం రోజులుగా గుడిసెలు వేసుకుని ఆక్రమించారు. దాంతో రెవెన్యూ అధికారులు వారికి నోటీసులు జారీ చేసి సోమవారం తొలగింపు కార్యక్రమం చేపట్టారు. తహసీల్దారు వి స్వామినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గుడిసెలను తొలగించడంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చేవరకు గుడిసెలు తొలగించడాని వీల్లేదని మహిళలు అడ్డుకోవడంతో వారిని పక్కకు నెట్టి గుడిసెలు తొలగించి కుర్చీలు, షామియానాలు ట్రాక్టరుపై వేసి తీసుకెళ్లారు. ఈ సంఘటనలో కొందరు మహిళలు కింద పడిపోయారు. కుంచే పెద్దింట్లు అనే మహిళ ఈ సంఘటనలో స్పృహ కోల్పోవడంతో ఆమెను 108లో పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. ఆనంతరం పాలకొల్లు వైసీపీ కన్వీనర్ గుణ్ణం నాగబాబు, పాలకొల్లు మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు యడ్ల తాతాజీ, ఇలపకుర్రు మాజీ సర్పంచ్ చిలువూరి దత్తాత్రేయ కుమారవర్మ, పీవీ రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్య వరప్రసాద్ సంఘటనా స్థలంలో బైఠాయించి బాధితులకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.
వివరాల ప్రకారం గతంలో వైఎస్ ప్రభుత్వ హయాంలో అబ్బిరాజుపాలెం గ్రామానికి చెంధిన బ్రాహ్మణ కుటుంబీకుల వద్ద ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసిన సమయంలో ఆ స్థలాల్లో ఎస్సీలుండడంతో ఆ సమయంలో తహసీల్దారు మీకు కూడ పట్టాలిస్తామని హామీ ఇవ్వడంతో వారు రోడ్డు పక్కనే గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వీరికి పట్టాలివ్వకుండా దొడ్డిపట్ల గ్రామానికి చెందిన పట్టాలివ్వడంతో గుడిసెలు వేసుకున్నట్టు ఎస్సీలు చెప్పారు. ఈ విషయమై తహసీల్దారు స్వామినాయుడు బాధితులతో మాట్లాడుతూ రేషను కార్డులు దొడ్డిపట్ల గ్రామంలో ఉంటే పట్టాలిస్తామని, ఇలపకుర్రులో ఉండే అక్కడే ఇస్తామని, గుడిసెలు తొలగించాలని కోరారు. అనర్హులకు, ఇతర గ్రామాలకు పట్టాలిచ్చారని, దళితులైన తమకు ఇవ్వడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పట్టాలిచ్చిన తరువాత గుడిసెలు తొలగించాలని అనడంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గుడిసెలు తొలగించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు సీఐ రజనీకుమార్, యలమంచిలి, పోడూరు, ఆచంట ఎస్సైలు పాల్గొన్నారు.
ఈ బెల్లం బెల్లంకాదు
*పంచదార పాకంతో తయారీ
*విజిలెన్స్‌దాడుల్లో వెలుగుచూసిన వైనం
*రూ. 5 లక్షలు సరుకు స్వాధీనం

ఏలూరు, అక్టోబర్ 8 : అనకాపల్లి బెల్లానికి వున్న ప్రాధాన్యతను, పాపులారిటీని వాడేసుకుని పంచదార పాకానే్న వాడేసి దానే్న అనకాపల్లి బెల్లం మాదిరిగా రూపొందించి అమ్మేస్తున్న ముఠా ఒకటి తాజాగా విజిలెన్స్ విభాగానికి పట్టుబడింది. వీరవాసరం మండలం కొణితివాడ శివారు ఉత్తర పాలెంలో విజిలెన్స్ ఎస్‌పి వి అచ్యుతరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారుల బృందం సోమవారం దాడులు చేసింది. ఈ సందర్భంగా విస్తుపోయే వ్యవహారాలు వెలుగుచూసాయి. ఈ ప్రాంతంలో చెరకు పంట లేకపోయినా అక్కడ బెల్లం తయారీ భారీగా సాగిపోతున్న వైనం అధికారులు కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ రంగంలోకి దిగి ఆ బెల్లం తయారీ కేంద్రం వద్దకు వెళ్లాక అసలు విషయం బయటపడింది. అనకాపల్లిలో నాశిరకం బెల్లాన్ని అతితక్కువ ధరకు కొనుగోలు చేసి దాన్ని ఇక్కడకు తీసుకువచ్చి పంచదార పాకంతో కలిపి దానితోపాటు మరికొన్ని రసాయనాలను జోడించి చివరకు వీరే మేలురకం బెల్లం పేరుతో కృత్రిమ బెల్లాన్ని విక్రయించేస్తున్నారు. వాస్తవానికి చెరకుతో తయారయ్యే బెల్లం ఉత్పత్తి కొంత డల్‌గా వుండి తీపి కూడా కొంత తక్కువగా వుంటుంది. అయితే ఇక్కడ తయారయ్యే బెల్లం మాత్రం తాజాగా కనిపిస్తూ బెల్లం రంగు కూడా ఆకర్షణీయంగా రూపొందుతుంది. బెల్లం కూడా తియ్యగా వుండి విక్రయానికి అనువుగా తయారవుతుంది. అయితే రసాయనాలు కలిపిన ఈ బెల్లం వినియోగించడం వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం మాత్రం గట్టిగానే వున్నట్లు అధికారులు భావిస్తున్నారు. బెల్లంబట్టీ నిర్వాహకుడు ఆరేపల్లి శివవెంకట సత్యనారాయణను అరెస్టు చేసి ఏడు వేల కేజీల అనకాపల్లి బెల్లాన్ని, 9 వేల కేజీల పంచదారను, 640 కేజీల మిక్స్‌డ్ బెల్లాన్ని అధికారులు సీజ్ చేశారు. దీని ఖరీదు దాదాపు అయిదు లక్షల రూపాయల వరకు వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సి ఐ ఎన్‌వి భాస్కరరావు, ఎస్ ఐ కె సీతారామ్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఎస్ శ్రీనివాసరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.