క్రైమ్/లీగల్

వ్యవసాయ బావిలో దూకి తల్ల్లీ కొడుకుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, అక్టోబర్ 8: కుటుంబ కలహాలతో వ్యవసాయ బావిలో దూకి తల్లి, కొడుకులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలం వెంకటాద్రిపేట గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, గ్రామస్ధుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన శివరాత్రి బాలరాజు భార్య రజిత(25), కుమారుడు నిరంజన్(4)లు కుటుంబ కలహాలతో సోమవా రం సాయంత్రం గ్రామశివారులో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన రజితతో నాలుగేళ్ల క్రితం వివా హాం జరిగింది, అప్పటినుండి భార్య, భర్తల మధ్య తరచూ గొడువలు జరిగేవని వారి బంధువులు తెలిపారు. ఈక్రమంలో సోమవారం కూలీపని చేసుకుని ఇంటికి వచ్చిన రజితతో భర్త బాలరాజు మళ్లీ గొడువ పడడంతో మనస్థాపానికి గురైన రజిత తన కుమారుడు నిరంజన్‌ను తీసుకుని శివారులో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్ళి కొడుకుతో సహా బావిలో దూకినట్లు చెప్పా రు. బావిలో రెండు శవాలు కనిపించడంతో స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారాన్ని తెలుసుకున్న ఘన్‌పూర్ ఏసీపీ వెంకటేశ్వరబాబు, స్థానిక ఎసై శ్రీనివాసు అక్కడికి చేరుకుని రెండు మృతదేహాలను వెలికి తీశారు. పంచనామా నిర్వహించి న పోలీసులు పోస్టుమార్టం కోసం వరంగల్ ఎం జీఎం ఆసుపత్రికి తరలించారు. రజిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త బాలరాజును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.