క్రైమ్/లీగల్

పరువు హత్యకు ఆధారాలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, అక్టోబర్ 29: కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి పందరబోయిన ఇంద్రకళావతి (20) అనుమానాస్పద మృతిని పరువుహత్యగా చూసేందుకు ఎలాంటి ఆధారాలు లభ్యం కావడం లేదని మార్కాపురం డివైఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ ఎలా మృతిచెందింది అనేదానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. తండ్రి ఇచ్చిన సమాచారం ఆధారంగా అనుమానాస్పద మృతిగా భావిస్తున్నామని తెలిపారు. మృతురాలి తండ్రి, తల్లి, మృతురాలు మాత్రమే ఇంట్లో ఉన్నారని, వారి సోదరుడు గ్రామంలోని ఇతరప్రాంతంలో నివాసం ఉంటున్నాడని, తెల్లవారుజామున చెల్లెలు మృతిచెందిన విషయాన్ని తెలుసుకొని ఇంటికి వచ్చినట్లు బంధువులు తెలిపారని డివైఎస్పీ రామాంజనేయులు తెలిపారు. మృతురాలి తల్లి అనారోగ్యంతో ఉందని, అయితే తండ్రే ఏదైనా చేసి ఉంటాడని భావించినప్పటికీ విచారణలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. అయితే ఇంద్రకళావతి వెళ్ళిపోయిన యువకునికి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారని తనకు సమాచారం వచ్చినట్లు తెలిపారు. తల్లిదండ్రులు బంధువులతో వివాహం చేసేందుకు సిద్ధం అవుతున్న సమయంలో ఇంద్రకళావతి మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. కాగా, మృతురాలి తండ్రి ఆవులయ్య మాత్రం తాము ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని, అయితే విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చిఉంటే బంధువుతో నిశ్చితార్థం జరిపి ఉండేవారం కాదుకదా అని చెప్పామని తెలిపారు. తెల్లవారుజామున ఇంటి తలుపులు తీయగా కుమార్తె మృతిచెంది ఉండటంతో గ్రామంలో ఉన్న తన కుమారునికి సమాచారం అందించామని తెలిపినట్లు డివైఎస్పీ తెలిపారు. అయితే వెంటనే మృతదేహాన్ని దహనం చేయడంపై ప్రశ్నించగా, వివాహం కావాల్సిన కుమార్తె మృతి చెందడంతో బయటకువస్తే పలు అనుమానాలకు తావివ్వాల్సి వస్తుందని దహనం చేసినట్లు తెలిపాడని తెలిపారు. కాగా, మృతదేహం లేకపోవడం, సంఘటన చూసినవారు ఎవరూ లేకపోవడంతో తండ్రి ఆవులయ్య ఇచ్చే సమాచారంపైనే కేసు ఆధారపడి ఉంటుందని డివైఎస్పీ రామాంజనేయులు తెలిపారు. అయినప్పటికీ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని ఆయన తెలిపారు.