క్రైమ్/లీగల్

గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలేటివారిపాలెం, అక్టోబర్ 29: మండలంలోని కలవళ్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీ గుండెపోటుతో మృతిచెందాడు. సోమవారం ఉదయం గ్రామానికి చెందిన మోదేపల్లి కృష్ణ (32) ఉపాధిహామీ పనికి వెళ్లి పనిచేస్తుండగా గుండెనొప్పి రావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు కూలీలు తెలిపారు. కాగా, ఉపాధి కూలీ కృష్ణ చంద్రన్న బీమా పథకంలో సభ్యుడు కావడంతో బీమా పరిహారం కింద మట్టి ఖర్చుల నిమిత్తం ఐదువేల రూపాయల నగదును మృతుని కుటుంబ సభ్యులకు టీడీపీ నాయకులు పోతుల ప్రసాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపియం లాజరు, మన్నం కృష్ణ, మోదేపల్లి నారాయణ తదితరులు ఉన్నారు.

ఇరువర్గాల ఘర్షణలో ఒకరు మృతి

వలేటివారిపాలెం, అక్టోబర్ 29 : మండలంలోని చుండి అయ్యవారిపల్లె గ్రామంలో ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాలకొండరాయుడుపై అదే గ్రామానికి చెందిన చిరంజీవి తన అనుచరులతో దాడి చేశారు. ఈసందర్భంగా మాలకొండరాయుడు పెద్దగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న గంగయ్య తన భార్య రమణమ్మతో వచ్చి సర్దిచెప్పబోగా అతనిపై కూడా దాడి చేయగా గాయపడిన గంగయ్యను ఆటోలో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో 108 వాహన సిబ్బంది పరీక్షించి మరణించినట్లు చెప్పారని మృతుని భార్య రమణమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సమాచారం అందుకున్న కందుకూరు డిఎస్పీ ప్రకాశరావు, సిఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఘర్షణకు గల కారణాలను తెలుసుకున్నారు. వలేటివారిపాలెం ఎస్సై అజయ్‌బాబు మృతుడి భార్య రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.