క్రైమ్/లీగల్

రైల్వే ఉద్యోగాల పేరుతో యువతకు కుచ్చుటోపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం : రైల్వే ఉద్యోగాల పేరుతో యువతకు కుచ్చుటోపి పెట్టిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాచారం ఎస్‌ఓటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ తెలిపిన కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన గణేష్(47), షేక్ మహ్మాద్ కాశీం(37), శివారంజీని(25), ప్రవీణ్ (23), ముఠాగా ఏర్పడి నిరుద్యోగా యువతను టార్గెట్ చేసిన రైల్వే ఉద్యోగాలను ఇప్పిస్తామని ఆశ చూపి మోసం చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలకు చెందిన సుమారు 50 మందిని రైల్వే ఉద్యోగాల పేరుతో నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి రూ.లక్షలు తీసుకోని మోసం చేసినట్లు ఫిర్యాదు రావడంతో ప్రత్యేక దర్యాప్తూ చేసినట్లు ఎస్‌ఓటీ ఏసీపీ సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. నిందితులను అదుపులోనికి తీసుకొని విచారించగా 10మంది యువకులను కలకత్తాకు తీసుకెళ్లి నకిలీ ఉద్యోగపత్రాలు అందిజేసి వచ్చినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు నిందితులను ఆరెస్టు చేసి వారివద్ద నుంచి రూ.లక్ష నగదు, రెండు బ్యాంక్ చెక్‌లు, 8 సెల్ ఫోన్లు, 10కోర్టు నాన్‌జ్యూడియషిల్ స్టాంప్‌లను స్వాధీనం చేసుకునట్లు నాచారం సీఐ మహేష్ తెలిపారు.

తుపాకీతో బ్యాంక్‌లో హల్‌చల్

కరూర్ వైశ్యా బ్యాంక్‌లో దోపిడీకి విఫలయత్నం
బెదిరించిన నిందితుడు ఐదు లక్షలతో పరారయ్యే యత్నం

గచ్చిబౌలి: బుర్కా ధరించి మహిళా ఖాతాదారుగా బ్యాంకులోకి ప్రవేశించి క్యాషియర్ కౌంటర్‌లోకి చొరబడి అతని వద్ద ఉన్న డబ్బును బ్యాగులో వేసుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. తనతో తెచ్చుకున్న తుపాకీ, కత్తితో ఉద్యోగులను చంపేస్తానని బెదిరించి డబ్బుతో ఉడాయించాలని ప్రయత్నించిన నిందితుడిని బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులు, స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని మణికొండలో జరిగింది. బ్యాంకు ఉద్యోగులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని మణికొండ కరూర్ వైశ్య బ్యాంక్‌లోకి మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో డేవిడ్ ప్రవీణ్ (45) అనే వ్యక్తి బుర్కా ధరించి బ్యాంక్‌లోకి ప్రవేశించాడు. క్యాషియర్‌తో మాట్లాడాలని కౌంటర్ లోపలికి వెళ్లి క్యాషియర్‌కి తుపాకీ చూపించి అతని వద్ద ఉన్న ఐదు లక్షల రూపాయలను తనతో తెచ్చుకున్న బ్యాగ్‌లో వేసుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. డబ్బు తీసుకున్న అనంతరం బ్యాంకు ఉద్యోగులను తనకు మోటరు సైకిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు. నిందితుడు బ్యాంకులో ఉన్నంతసేపు ఉద్యోగులకు తుపాకీ, చాకుతో భయబ్రాంతులకు గురి చేశాడు. బాటిల్‌లో ఫినాయిల్ తీసుకుని వచ్చిన నిందితుడు అది పెట్రోల్ అని వీటితో పాటు తన వద్ద బాంబు ఉందని ఎవరైనా అడ్డువస్తే కాల్చివేస్తానని బెదిరించాడు. సుమారు 15 నిముషాలు ఉద్యోగులను, బ్యాంకులో ఉన్న ఖాతాదారులను భయపెట్టాడు. నిందితుడు బ్యాంకులోకి వచ్చిన సమయంలో క్యాషియర్ వద్ద రూ.15లక్షలు పైచిలుకు నగదు ఉందని మేనేజర్ తెలిపారు. ప్రవీణ్ చేతికి అందిన ఐదు లక్షలు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఖాతాదారులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడికి ఇదే బ్యాంకులో ఖాతా ఉండడం విశేషం. నిందితుడి స్వగ్రామం విశాఖపట్నమని, మణికొండలోని హూడా కాలనీలో నివాసముంటున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిపై పాత కేసులు ఉన్నాయా అని తెలుసుకుంటున్నామని రాయదుర్గం సీఐ రాంబాబు తెలిపారు.మేనేజర్ మహేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విచారణలో తుపాకీ డెమీ అని తేలింది.

సరిహద్దుల్లో నిఘా రూ.6.80లక్షల పట్టివేత
షాద్‌నగర్, అక్టోబర్ 29: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సరిహద్ధు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని 44వ జాతీయ రహదారి తిమ్మాపూర్ నుంచి ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామ సమీపంలో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగానే ఈనెల 23న జీఎంఆర్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఇరువురి వ్యక్తుల నుంచి రూ.6.80లక్షల నగదు లభించినట్లు షాద్‌నగర్ పోలీసులు తెలిపారు. పోలింగ్‌కు నెల రోజులకుపైగా సమయం ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు ముందుగానే గ్రామాలకు పెద్ద మొత్తంలో నగదు, మద్యం తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పోలీసుల తనిఖీలు బయటకు వస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో నోట్ల కట్టలు బయటపడుతుండటంతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికలకు సమయం ఎక్కువగా ఉన్నప్పటికి వివిధ పార్టీల అభ్యర్థులు ముందు జాగ్రత్తగా మద్యం, డబ్బులు గ్రామాలకు తరలిస్తున్న నేపథ్యంలోనే పోలీసులకు పట్టుబడుతున్నాయి. రూ.50వేలకు మించి నగదును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు ఇది వరకే స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలను, కోడ్‌ను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీస్ అధికారులు అంటున్నారు. షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని 44వ జాతీయ రహదారితోపాటు మండలాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
వసూళ్ల ముఠా సభ్యులు అరెస్టు
ఖైరతాబాద్, అక్టోబర్ 29: బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. వివాదాస్పద స్థలాలు, నగదు వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్ చేసుకోవాలని అవతలి వ్యక్తులకు సూచిస్తారు. గంటల వ్యవధిలో సెటిల్‌మెంట్ చేసుకోక పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తారు. అనంతరం నేరుగా ఇంటికి వెళ్లి ఇంట్లోని సామాగ్రీని ధ్వంసం చేసి హంగామా చేస్తారు. అప్పటికి స్పందించక పోతే నేరుగా చంపేస్తామంటూ పెట్రోల్ చల్లి భయబ్రాంతులకు గురిచేస్తారు. ఈ సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భయపెడతారు. ఇలా వేధింపులకు గురైన బాధితులు 2014లో పోలీసులను ఆశ్రయించారు. అప్పటి నుంచి నిందితుల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్సిపెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలోని బృందం నందమాల అరవింద్ కుమార్, ఆకుల పవన్‌కుమార్, బత్తుల శివ నర్సింహ, కొత్తపల్లి సురేష్, పాలకుర్తి రాజేష్, అన్నారం ప్రశాంత్, జీ.రవి, త్యాగులను అదుపులోని తీసుకొని విచారించగా వీరి నేరాల చిట్ట బయటపడింది. దీంతో విరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో ప్రధాన నిందుతులైన ప్రసాద్, వెంకట రావు పరారీలో ఉన్నారని త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ గోవింద్ రెడ్డి, డీఐ రవికుమార్ పాల్గొన్నారు.

ముగ్గురు అంతర్ రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్టు
గచ్చిబౌలి, అక్టోబర్ 29: చదివింది 10వ తరగతే అయినా.. ఏటీఎం సెంటర్‌లో ఎంత జాగ్రత్త డబ్బులు డ్రా చేసుకున్నప్పటికీ పిన్ నెంబర్‌ని పరిశీలించి డబ్బును కాచేయడంలో వారు సిద్ధహస్తులు, ఏటీఎం సెంటర్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న బీహార్‌కు చెందిన ముగ్గురు అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి లక్షా పదివేల రూపాయలు నగదుతో పాటు 18 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్టు సైబరాబాద్ పోలీసులు కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను సీపీ వెల్లడించారు. బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్‌కు చెందిన మనీష్ కుమార్ (19) వినోద్‌కుమార్ (18) మనోజ్‌కుమార్ (21) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కంపెనీలో పనిచేయాడానికి వచ్చారు. పని చేస్తు ఖాళీ సమయంలో ఏటీఎం సెంటర్ల వద్ద నిలబడి డబ్బులు డ్రా చేయడానికి వచ్చినవారి వెనుక నిలబడి పిన్, కార్డు నెంబర్‌ను నోట్ చేసుకుని ఫ్లిప్‌కార్ట్‌లో విలువైన మొబైల్ ఫోన్లను కొనుగోలుచేసి విక్రయించారని పేర్కొన్నారు. ఈ కామర్స్ సైట్‌లో ఓటీపీ అవసరం లేకుండా పిన్ నెంబర్‌తో వస్తువులను కొనుగోలు చేసి వాటిని బయట విక్రయించుకుని సోమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. ఓటీపీ సౌకర్యం లేని యాక్స్‌స్, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. షాద్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి ఖాతానుంచి 3లక్షల 89500 రూపాయలు నిందితులు డ్రా చేసుకోవడంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను బిహార్ వెళ్లి అరెస్టు చేశామని వివరించారు.
నిందితులు ముగ్గురు 10వ తరగతి వరకు కూడా చదువు కోలేదని అయినప్పటికీ టెక్నాలజీ ఉపయోగించుకుని మోసాలు చేయడంలో ఆరితేరారని అన్నారు. నిందితుల నుంచి లక్షా 10వేల రూపాయలు నగదు, 18సెల్ ఫోన్లు, ఐదు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ జానకీ షర్మిల, ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, ఎస్‌ఐ విజయవర్ధన్, గౌతమ్ ఉన్నారు.