క్రైమ్/లీగల్

265కు చేరిన బాధితుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్‌లొట్టి (అమెరికా), ఫిబ్రవరి 1: అమెరికా జిమ్నాస్టిక్స్ వైద్యుడు లారీ నాజర్‌పై కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మిచిగాన్ యూనివర్సిటీ క్లినిక్‌లో వైద్యుడిగా పనిచేసిన నాజర్ వైద్య పరీక్షల పేరుతో మహిళా జిమ్నాస్ట్స్‌పై అత్యాచారాలకు ఒడిగట్టేవాడు. ఒక మాజీ జిమ్నాస్ట్ పోలీసులను ఆశ్రయించడంతో నాజర్ నిర్వాకం యావత్ ప్రపంచానికి తెలిసింది. క్రీడారంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ సంఘటనపై విచారణ జరిపిన మిచిగాన్ కోర్టు ఇదివరకే అతనిని 60 ఏళ్ల జైలుశిక్ష విధించింది. కాగా, మరింతమంది బాధితులు ముందుకు వచ్చి తమపై నాజర్ అత్యాచారాలు చేసినట్టు ధృవీకరిస్తున్న నేపథ్యంలో మిచిగాన్ కోర్టు మరోసారి ఈ కేసును విచారిస్తోంది. నాజర్‌కు కనీసం మరో 40 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కోర్టు ప్రకటించిన జైలు శిక్షకు అదనంగా మరో 40 నుంచి 175 ఏళ్లవరకు శిక్షను విధించే అవకాశాలు ఉన్నట్టు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. సదరు వైద్యుడు తన వద్దకు పరీక్షల కోసం వచ్చే జిమ్నాస్ట్‌లను నయానో భయానో బెదిరించి అత్యాచారాలకు పాల్పడుతుండేవాడు. వైద్య పరీక్షల పేరిట అతను గత రెండు దశాబ్దాలుగా ఈ అమానవీయ చర్యలకు పాల్పడుతున్నాడని బాధితులు కోర్టుకు నివేదించారు. ఈ వైద్యుడి నిర్వాకానికి బలైనవారిలో ఒలింపిక్స్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించిన జిమ్నాస్ట్‌లు కూడా ఉన్నారు.
ఇదిలావుండగా ఇప్పటివరకు 265 మంది జిమ్నాస్ట్ బాధితులను గుర్తించామని, ఇంకా దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరెంతోమంది బాధితులు ఉండవచ్చని జడ్జి జానిస్ కన్నింగ్‌హామ్ అనుమానం వ్యక్తం చేశాడు. ‘జిమ్నాస్ట్ వైద్యుడు లారీ నాజర్ ఒక భూతమని, క్రూరమైన మనస్తత్వం కలిగినవాడు’ అని జెస్సికా థామషో అనే 17 ఏళ్ల జిమ్నాస్ట్ ధ్వజమెత్తింది. అతనికి కనీసం 25 ఏళ్ల శిక్ష విధించాలని తన ఫిర్యాదులో విజ్ఞప్తి చేసింది. ఇదిలావుండగా, జిమ్నాస్ట్ వైద్యుడు లారీ నాజర్ వస్తున్న వందలాది ఫిర్యాదుల నేపథ్యంలో అతనిపై సమగ్ర దర్యాప్తు చేసి, విచారించాలని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ ఆదేశించాడు. మహిళా జిమ్నాస్ట్‌లపై జరిగిన దారుణాలకు బాధ్యత వహించి అమెరికా జిమ్నాస్ట్ బోర్టు సభ్యులు తక్షణం రాజీనామా చేయాలని అమెరికా ఒలింపిక్స్ కమిటీ డిమాండ్ చేసింది.