క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, జూన్ 8: లక్ష రుపాయలు లంచం తీసుకుంటుండగా మహేశ్వరం ఎక్పైజ్ సీఐ ఎన్.శ్రీనివాసులను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం సాయంత్రం మహేశ్వరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తన సిబ్బందితో దాడులు నిర్వహించి శ్రీనివాసులను రెడ్‌హ్యండెండ్‌గా పట్టుకొని నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం మండలం మన్సాన్‌పల్లి గ్రామానికి చెందిన పబ్బ రాఘవేందర్ గౌడ్.. టీఎఫ్‌టీ లైసెన్స్‌తోపాటు కల్లు దుకాణం కోసం దరఖాస్తు చేసుకొగా అందుకు సంబంధించిన షూరిటీ, పేపర్లు, బాండ్లు, ప్రభుత్వం చలాన్లులో పాటు ప్రతిపాదనలు ఎక్సైజ్ సూపరిండెట్‌కు పంపడానికి లక్ష రూపాయలను శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు రాఘవేందర్ ఆశ్రయించగా శుక్రవారం దాడులు చేశారు. ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన సీఐ శ్రీనివాసులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.