క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, జూన్ 9 : మండలంలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన సాయికుమార్ (17) శనివారం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సాయికుమార్‌కు కొద్దినెలల నుంచి మూర్చవ్యాధితో బాధపడేవాడు. ఈనేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జనార్ధన్‌నాయుడు తెలిపారు.
టిప్పర్, ద్విచక్ర వాహనం ఢీ - ఒకని మృతి
మడకశిర, జూన్ 9 : మడకశిర మండలం భూతప్పకనుమ క్రాస్ వద్ద టిప్పర్, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో చిదానంద (38) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం హిరియూరు తాలూకా బిదర్‌కెరె గ్రామానికి చెందిన దినేష్, చిదానంద శనివారం ఉదయం స్వగ్రామం నుంచి కదిరి లక్ష్మీ నరసింహాస్వామి దర్శనార్థం వెళ్తుండగా మడకశిర నుంచి అమరాపురం వైపు వెళ్తున్న టిప్పర్ మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో చిదానంద తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన రైతులు 108 ద్వారా మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించగా చిదానందం ఆసుపత్రికి చేరుకోగానే మృతి చెందాడు. మడకశిర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.