క్రైమ్/లీగల్

నిండ్రలో కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగిరి, జూన్ 9: నిండ్ర మండలంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరికు వారి ఆత్మహత్యకు దారితీసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సుబ్రహ్మణ్యం రెడ్డి (55), భార్య లక్ష్మి (45)లు ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిండ్ర బీసీ కాలనీలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం రెడ్డి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన సుబ్రహ్మణ్యం రెడ్డి సంపాదన పూర్తిగా తాగుడుకే ఖర్చుపెడుతూ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఈవిషయమై భార్య లక్ష్మి తరచూ సుబ్రహ్మణ్యం రెడ్డితో గొడవపడేది. నిండ్రలో గత బుధవారం జాతర జరిగింది. బుధవారం నుంచి నిరంతరాయంగా మద్యం మత్తులో ఊంటూ ఇంటికి కూడా సక్రమంగా రాలేదు. దీంతో మనస్థాపానికి గురైన లక్ష్మి శుక్రవారం సాయంత్రం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి ఇంటికి చేరుకున్న సుబ్రహ్మణ్యం రెడ్డి భార్య ఉరివేసుకొని ఉండటాన్ని గమనించి ఆమెను కిందకు దించాడు. లక్ష్మీ మృతిచెంది ఉండటంతో భయపడి అదే దారానికి తానూ ఉరివేసుకొని సుబ్రహ్మణ్యం రెడ్డి కూడా మృతి చెందాడు. శనివారం ఉదయం చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు గమనించి ఈ విషయాన్ని పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఎస్‌ఐ నరేంద్ర మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరుకు తరలించారు. సుబ్రహ్మణ్యం రెడ్డి దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఆమెకు 2 సంవత్సరాల క్రితం వివాహమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేంద్ర తెలిపారు.